Telugu Global
Others

ఎలుగుబంటికి కారుణ్య మరణం

నయం కాని జబ్బులతో చిత్రహింసలు అనుభవిస్తున్న వారికి కారుణ్యమరణం ప్రసాదించే పద్దతి విదేశాల్లో ఉంది. మన దేశంలో ఇప్పటి వరకు మనుషుల విషయంలో ఆ పద్దతి లేదు. కానీ ఓ ఎలుగుబంటికి మాత్రం ఇండోర్‌ జూ అధికారులు కారుణ్యమరణం ప్రసాదించారు. సోను అనే హిమాలయన్‌ ఎలుగు బంటిని ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా శాశ్వత నిద్రను కల్పించారు. అంతిమయాత్రకు ముందు అనేక కార్యక్రమాలు చేశారు. 33 ఏళ్ల సోను ఇండోర్ జూలోనే పుట్టింది. కానీ మూడేళ్ల క్రితం పక్షవాతం […]

ఎలుగుబంటికి కారుణ్య మరణం
X

నయం కాని జబ్బులతో చిత్రహింసలు అనుభవిస్తున్న వారికి కారుణ్యమరణం ప్రసాదించే పద్దతి విదేశాల్లో ఉంది. మన దేశంలో ఇప్పటి వరకు మనుషుల విషయంలో ఆ పద్దతి లేదు. కానీ ఓ ఎలుగుబంటికి మాత్రం ఇండోర్‌ జూ అధికారులు కారుణ్యమరణం ప్రసాదించారు. సోను అనే హిమాలయన్‌ ఎలుగు బంటిని ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా శాశ్వత నిద్రను కల్పించారు. అంతిమయాత్రకు ముందు అనేక కార్యక్రమాలు చేశారు.

33 ఏళ్ల సోను ఇండోర్ జూలోనే పుట్టింది. కానీ మూడేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి కదలలేని స్థితిలో బోనుకే పరిమితమైంది. సొంతంగా పక్కకు కూడా కదలలేని స్థితి. అత్యుత్తమ వైద్యం అందించనప్పటికీ ఏ మాత్రం కోలుకోలేదు. ఇటీవల సోను పరిస్థితి మరింత దిగజారింది. దీంతో దాని పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయిన జూ సిబ్బంది ఉన్నతాధికారుల అనుమతితో ఇంజెక్షన్ ఇచ్చి విముక్తి కల్పించారు.bear-d

ఇంతకాలం ఎలుగుబంటి సంరక్షణను చూసిన జీవన్‌దాదా చివరి సారిగా సోనుకు ఇష్టమైన ఆహారాన్ని ముందుంచారు. అనంతరం ఇంజెక్షన్ ఇచ్చారు. ఎలుగుబంటికి కారుణ్యమరణం ప్రసాదిస్తున్న విషయం తెలుసుకున్న జూ సందర్శకులు అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. సోను ఉన్న బోనును పూలతో అలంకరించారు. అనంతరం ఊరేగింపుగా అంతిమయాత్ర నిర్వహించారు. సాధారణంగా ఎలుగుబంట్లు 25 ఏళ్ల నుంచి 30 ఏళ్లు బతుకుతాయని… సోను మాత్రం 33ఏళ్లు కావడంతో కోలుకోలేకపోయిందని అధికారులు చెబుతున్నారు. bear-2

First Published:  6 Dec 2015 7:12 AM GMT
Next Story