Telugu Global
Others

సంకట స్థితిలో కొణతాల రామకృష్ణ

కొన్ని నెలల క్రితం వైసీపీని వీడి వెళ్లిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పరిస్థితి ఇప్పుడు సంకటంలో  పడింది. వైసీపీని వీడిన తర్వాత టీడీపీలో చేరేందుకు కొణతాల ప్రయత్నించారు. విశాఖ జిల్లాకు చెందిన మంత్రి చింతకాయల అయన్నపాత్రుడు… కొణతాల ప్రయత్నాలకు సహకరించారు. అయితే కొణతాల ఎంట్రీకి టీడీపీ నుంచి అనుకోని ప్రతిఘటన ఎదురవుతోంది.  అయన్నపాత్రుడు మినహా మిగిలిన విశాఖ జిల్లా టీడీపీ నేతలంతా కొణతాల రాకను వ్యతిరేకిస్తూ గ్రూప్ కట్టారు. Also Read ఆనం బ్రదర్స్ చంద్రబాబును […]

సంకట స్థితిలో కొణతాల రామకృష్ణ
X

కొన్ని నెలల క్రితం వైసీపీని వీడి వెళ్లిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పరిస్థితి ఇప్పుడు సంకటంలో పడింది. వైసీపీని వీడిన తర్వాత టీడీపీలో చేరేందుకు కొణతాల ప్రయత్నించారు. విశాఖ జిల్లాకు చెందిన మంత్రి చింతకాయల అయన్నపాత్రుడు… కొణతాల ప్రయత్నాలకు సహకరించారు. అయితే కొణతాల ఎంట్రీకి టీడీపీ నుంచి అనుకోని ప్రతిఘటన ఎదురవుతోంది. అయన్నపాత్రుడు మినహా మిగిలిన విశాఖ జిల్లా టీడీపీ నేతలంతా కొణతాల రాకను వ్యతిరేకిస్తూ గ్రూప్ కట్టారు.

Also Read ఆనం బ్రదర్స్ చంద్రబాబును ఏమని తిట్టారంటే!

కొద్దికాలంగా చంద్రబాబుకు దగ్గరయ్యేందుకు కొణతాల తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. అనకాపల్లిలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబును ఆహ్వానించాలని భావించారు. అనకాపల్లి ఎమ్మెల్యే గోవింద్ ద్వారా తొలుత ఈ ప్రయత్నాలు చేశారు. కానీ కొణతాల పార్టీలోకి రావడం ఇష్టం లేని గోవింద్… చంద్రబాబు ప్రైవేట్‌ కార్యక్రమాలకు రావడం లేదంటూ దాటవేశారు. ఈ నేపథ్యంలో తిరిగి మంత్రి అయన్న సాయంతో ఇటీవల నేరుగా చంద్రబాబును కొణతాల కలిశారు. ఈ విషయాన్ని మంత్రి కూడా ధృవీకరిస్తున్నారు. అయితే చంద్రబాబు, కొణతాల ఏం మాట్లాడుకున్నారో మాత్రం తనకు తెలియదని చెబుతున్నారు. ఇలా కొణతాలను అయన్నపాత్రుడు సీఎం దగ్గరకు తీసుకెళ్లారని తెలియగానే వైరివర్గం అప్రమత్తమైంది.

కొణతాల రాకను వ్యతిరేకిస్తున్న వారంతా నాలుగు రోజుల క్రితం మంత్రి గంటా శ్రీనివాస్ ఆధ్వర్యంలో విశాఖలోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. అనంతరం ఎంపీ అవంతి శ్రీనివాస్‌ను సీఎం దగ్గరకు దూతగా పంపారు. కొణతాల రాకను నేతలు వ్యతిరేకిస్తున్న విషయాన్ని సీఎం దృష్టికి అవంతి తీసుకెళ్లారు. ఓ దశలో కొణతాలను మనం తీసుకోకపోతే మరో పార్టీలోకి వెళ్తారని అప్పుడు ప్రతిపక్షం బలపడుతుందని చంద్రబాబు ఒప్పించబోయారు. అయితే జిల్లా నేతలు మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గకపోవడంతో చివరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌కు ఈ వ్యవహారాన్ని అప్పగించారు.

కొణతాలను వ్యతిరేకిస్తున్న వర్గం కావాలంటే గతంలో టీడీపీని వీడివెళ్లిన దాడి వీరభద్రరావు పార్టీలోకి తీసుకురావాలని సూచిస్తోంది. ఈ సంకట పరిస్థితిపై కొణతాల వర్గం కలవరపడుతోంది. టీడీపీ నమ్ముకుని వైసీపీ నుంచి బయటకు వస్తే తీరా ఇలా తమతో ఆడుకుంటున్నారని వాపోతున్నారు. మొత్తం మీద ఇప్పుడు కొణతాల రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందన్న విషయం ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ చేతిలో ఉందని చెబుతున్నారు. కళా అభిప్రాయాన్ని బట్టే చంద్రబాబు ఈ విషయంలో ముందుకెళ్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

First Published:  29 Nov 2015 2:53 AM GMT
Next Story