Telugu Global
Others

విదేశీయులతో గొడవపడ్డ దగ్గుపాటి రానా తమ్ముడు

సినీ నటుడు రానా తమ్ముడు అభిరామ్‌కి, ఇద్దరు విదేశీయువకులకు మధ్య జూబ్లిహిల్స్‌లో గొడవ జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అభిరామ్‌ కారులో వెళ్తుండగా ఇద్దరు విదేశీయులు ద్విచక్రవాహనంపై అటుగా వచ్చారు. ఆ సమయంలో అభిరామ్‌ కారును వారి బైక్‌ తాకింది. దీంతో వెంటనే కారు ఆపిన అభిరామ్‌ … తన వాహనం ముందు భాగాన్నిపరిశీలించాడు. కారును ద్విచక్రవాహనం తాకిన గుర్తులు కనిపించడంతో వారి వెంట పరుగు తీశాడు. వారిని వెంబడించి పట్టుకున్నాడు. ఆ […]

విదేశీయులతో గొడవపడ్డ దగ్గుపాటి రానా తమ్ముడు
X

సినీ నటుడు రానా తమ్ముడు అభిరామ్‌కి, ఇద్దరు విదేశీయువకులకు మధ్య జూబ్లిహిల్స్‌లో గొడవ జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అభిరామ్‌ కారులో వెళ్తుండగా ఇద్దరు విదేశీయులు ద్విచక్రవాహనంపై అటుగా వచ్చారు. ఆ సమయంలో అభిరామ్‌ కారును వారి బైక్‌ తాకింది. దీంతో వెంటనే కారు ఆపిన అభిరామ్‌ … తన వాహనం ముందు భాగాన్నిపరిశీలించాడు. కారును ద్విచక్రవాహనం తాకిన గుర్తులు కనిపించడంతో వారి వెంట పరుగు తీశాడు. వారిని వెంబడించి పట్టుకున్నాడు. ఆ సమయంలో విదేశీయులపై అభిరామ్ చేయి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇరువురు పోటాపోటీగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామంటున్నారు.

First Published:  29 Nov 2015 7:26 AM GMT
Next Story