Telugu Global
Others

బాహుబలి సెట్టింగ్‌లో వ్యాపారి కూతురు పెళ్లి

దేశంలో బాహుబలి సృష్టించిన మానియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదో ట్రెండ్ సెట్టర్. బహుబలి సెట్టింగ్‌లు అందరినీ అబ్బురపరిచాయి. ఇప్పుడో బడా పారిశ్రామికవేత్త మరో అడుగు ముందుకేశారు. అందరిలాగా సినిమాలో సెట్టింగ్ చూసి ఊరుకోలేదు. తన కూతురు కోసం 20 కోట్లతో 8 ఎకరాల్లో అచ్చం బాహుబలి సెట్టింగ్ వేయించారు. అది కూడా బాహుబలి ఆర్ట్ డైరెక్టర్ సాబు శిరిల్‌తోనే ఈ సెట్టింగ్ వేయించారు. అరబ్‌ దేశాలలో బడా పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న రవి పిళ్లై […]

బాహుబలి సెట్టింగ్‌లో వ్యాపారి కూతురు పెళ్లి
X

దేశంలో బాహుబలి సృష్టించిన మానియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదో ట్రెండ్ సెట్టర్. బహుబలి సెట్టింగ్‌లు అందరినీ అబ్బురపరిచాయి. ఇప్పుడో బడా పారిశ్రామికవేత్త మరో అడుగు ముందుకేశారు. అందరిలాగా సినిమాలో సెట్టింగ్ చూసి ఊరుకోలేదు. తన కూతురు కోసం 20 కోట్లతో 8 ఎకరాల్లో అచ్చం బాహుబలి సెట్టింగ్ వేయించారు. అది కూడా బాహుబలి ఆర్ట్ డైరెక్టర్ సాబు శిరిల్‌తోనే ఈ సెట్టింగ్ వేయించారు.

అరబ్‌ దేశాలలో బడా పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న రవి పిళ్లై తన కూరుతు ఆర్తి వివాహం కోసం సెట్టింగ్ వేయించారు. ఈయనది కేరళ. కేరళలోని కొల్లంలో ఆశ్రమ మైదానంలో అంగరంగ వైభోగంగా ఈ వివాహాన్ని ప్లాన్‌ చేశారు. ఈ వివాహానికి దాదాపు 42దేశాల లీడర్స్ , వివిధ కంపెనీల సీఈఓలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ వేడుకలో హీరోయిన్స్ మంజు వారియర్స్ ,శోభనలు ట్రెడిషనల్ డ్యాన్స్ పెర్‌ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. అది కూడా బాహుబలి ఆర్ట్ డైరెక్టర్ సాబు శిరిల్‌తోనే ఈ సెట్టింగ్ వేయించారు. కూతురు పెళ్లి కోసం పిళ్లై ఏకంగా 55 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కేరళలోని కొల్లంలో ఆశ్రమ మైదానంలో అంగరంగ వైభోగంగా ఈ వివాహాన్ని ప్లాన్‌ చేశారు. రవి పిళ్ళై ఆర్ పీ గ్రూప్ కీ అధినేత కాగా ఈయన కు 26 కంపెనీలు ఉన్నాయి. దాదాపు 80 వేల మంది ఈ కంపెనీలలో చేస్తున్నారు.

First Published:  25 Nov 2015 7:05 PM GMT
Next Story