Telugu Global
Others

చంద్రబాబు షాక్‌ ఇచ్చిన గవర్నర్

గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య వివాదానికి తెరలేసింది. ఏపీ రాష్ట్ర్ర ఎన్నికల కమిషనర్ నియామకం తాజా వివాదానికి వేదికైంది. ఏపీ ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్, మాజీ ఏపీపీఎస్పీ చైర్మన్ చిత్తరంజన్ దాస్‌ బిశ్వాల్‌ను నియమించాలంటూ గవర్నర్‌ నరసింహన్‌కు ఏపీ ప్రభుత్వం పైల్ పంపింది. అయితే ఫైల్‌ను గవర్నర్ తిప్పిపంపారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం షాక్ అయింది. ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపడుతూ పైల్‌ వెనక్కు పంపడానికిగల కారణాలను కూడా గవర్నర్‌ కార్యాలయం వివరిస్తోంది. […]

చంద్రబాబు షాక్‌ ఇచ్చిన గవర్నర్
X

గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య వివాదానికి తెరలేసింది. ఏపీ రాష్ట్ర్ర ఎన్నికల కమిషనర్ నియామకం తాజా వివాదానికి వేదికైంది. ఏపీ ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్, మాజీ ఏపీపీఎస్పీ చైర్మన్ చిత్తరంజన్ దాస్‌ బిశ్వాల్‌ను నియమించాలంటూ గవర్నర్‌ నరసింహన్‌కు ఏపీ ప్రభుత్వం పైల్ పంపింది. అయితే ఫైల్‌ను గవర్నర్ తిప్పిపంపారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం షాక్ అయింది.

ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపడుతూ పైల్‌ వెనక్కు పంపడానికిగల కారణాలను కూడా గవర్నర్‌ కార్యాలయం వివరిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 319బి ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పనిచేసినవారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదవులకు మాత్రమే అర్హులు. మరే ఇతర పదవులు చేపట్టడానికి వీలుండదు. గవర్నర్ ఈ అంశాన్నే తెరపైకి తెచ్చారు. మరో అంశాన్ని కూడా గవర్నర్ ప్రస్తావించారు. చీఫ్ సెక్రటరీ ర్యాంకు వారు మాత్రమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవికి అర్హులు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన బిస్వాల్‌కు సి.ఎస్.ర్యాంకు లేదు. అందుకే గవర్నర్ ఫైల్‌ను నిలిపివేశారని ఆయన కార్యాలయం అధికారులు చెబుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం గవర్నర్ కావాలనే ఫైల్ వెనక్కు పంపారని అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఏపీపీఎస్పీ చైర్మన్‌గా పనిచేసిన మాజీ డీజీపీ పేర్వారం రాములును ఇటీవల తెలంగాణ ప్రభుత్వం స్టేట్ టూరిజయం కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించింది. అప్పుడు గవర్నర్ ఏమాత్రం అభ్యంతరం తెలపలేదు. మరి ఏపీ ప్రభుత్వం విషయంలో ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనికి గవర్నర్ కార్యాలయ వర్గాల మాత్రం టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్ పదవి భర్తీలో గవర్నర్ పాత్ర లేదని చెబుతున్నాయి. చంద్రబాబు నిర్ణయాన్ని గవర్నర్‌ అంగీకరించని నేపథ్యంలో ఈ విషయం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Click to Read: AP CS’s comment leave Government employees squirming

CLICK TO READ- చంద్రన్న కానుకపై స్టార్‌ హోటల్‌లో మాటువేసిన రింగ్ బ్యాచ్‌..?

First Published:  26 Nov 2015 2:37 AM GMT
Next Story