Telugu Global
Others

జోషీ నాగపూర్ ఎందుకెళ్తున్నట్టు?

బీజేపీ సీనియర్ నాయకుడు డా. మురళీ మనోహర్ జోషి వచ్చే గురు, శుక్రవారం ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కేంద్రమైన నాగపూర్ వెళ్తున్నారు. అధికారికంగా అయితే ఆయన ఆర్ ఎస్ ఎస్ ప్రచారకుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా సంపూర్ణ మానవతావాదం, భారతీయ తత్వ శాస్త్రం అన్న అంశాలపై ప్రసంగించాల్సింది ఉంది. సంపూర్ణ మానవతావాదమే తమ సిద్ధాంతమని ఇటీవల బీజేపీ చెప్తోంది. బిహార్ ఎన్నికల తర్వాత బీజేపీ సీనియర్ నాయకులైన లాల్ కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, […]

జోషీ నాగపూర్ ఎందుకెళ్తున్నట్టు?
X

బీజేపీ సీనియర్ నాయకుడు డా. మురళీ మనోహర్ జోషి వచ్చే గురు, శుక్రవారం ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కేంద్రమైన నాగపూర్ వెళ్తున్నారు. అధికారికంగా అయితే ఆయన ఆర్ ఎస్ ఎస్ ప్రచారకుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా సంపూర్ణ మానవతావాదం, భారతీయ తత్వ శాస్త్రం అన్న అంశాలపై ప్రసంగించాల్సింది ఉంది. సంపూర్ణ మానవతావాదమే తమ సిద్ధాంతమని ఇటీవల బీజేపీ చెప్తోంది.

బిహార్ ఎన్నికల తర్వాత బీజేపీ సీనియర్ నాయకులైన లాల్ కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, శాంతాకుమార్ ప్రస్తుత బీజేపీ అగ్రనాయకులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ నాయకులందరినీ పక్కన పెట్టారు. వారిని మార్గదర్శక మండలిలో నియమించినా వారు చేస్తున్న మార్గదర్శనమూ లేదు. ప్రధాని గాని, బీజేపీ అధ్యక్షుడు గానీ సీనియర్ నాయకులనుంచి కోరుతున్న మార్గదర్శకత్వమూ లేదు. ఇదే క్రమంలో అడ్వాణీ గత ఆదివారం అహ్మదాబాద్ వెళ్లినప్పుడు మోదీ ప్రభుత్వాన్ని పొగడడం సీనియర్ నాయకులు వ్యూహాత్మకంగా ఒకడుగు వెనక్కు వేయడం రెండడుగులు ముందుకు వేయడానికేనన్న వాదనలూ ఉన్నాయి.

ఈ పరిస్థితిలో జోషీ నాగపూర్ వెళ్లడంలో మరేదో ఆంతర్యం ఉందన్న గుసగుసలూ సాగుతున్నాయి. సంఘ్ పరివార్ కుదురుకు ఆర్ ఎస్ ఎస్ గురుపీఠం అన్న మాటలో విభేదాలకు తావు లేదు. ఒక వైపున బిహార్ ఫలితాలు వెలువడుతున్న సమయంలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింఘ్ సంఘ్ పరివార్ నాయకులతో భేటీ అయ్యారు. అందువల్ల జోషీ నాగపూర్ పర్యటన వెనక ఏదో మతలబు ఉందన్న ఊహాగానాలకు ఊతం వచ్చింది.

సీనియర్ నాయకులతో బీజేపీ నాయకులెవరూ ఇంతవరకు వారు లేవనెత్తిన అంశాలపై మాట్లాడలేదు. సాధారణంగా రాజ్ నాథ్ సింగ్ మధ్యవర్తిత్వం నెరపుతుంటారు. లేదా నితిన్ గడ్కరీ ఆ పని చేస్తుంటారు. కాని వాళ్లిద్దరూ పర్యటనలో ఉన్నందువల్ల సీనియర్ నేతలతో మాట్లాడే అవకాశం రాలేదంటున్నారు. అసంతృప్తి వ్యక్తం చేసిన నలుగురు నాయకులూ చాలా సీనియర్లు అయినందువల్ల వారితో ఎవరు మాట్లాడాలి అన్న సమస్యకూడా ఉంది. ఆర్ ఎస్ ఎస్ నాయకత్వంలో రెండో స్థానంలో ఉన్న సురేశ్ జోషీ ఈ పని చేయవచ్చుననుకున్నారు. అయితే మురళీ మనోహర్ జోషీ నాగ పూర్ లో ఉండే రెండు రోజులూ సురేశ జోషీ కానీ, ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ కానీ నాగపూర్ లో ఉండడం లేదు. అయినా అవసరమైతే వారు నాగపూర్ తిరిగి వచ్చే అవకాశం ఉందని కూడా బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు అంటున్నారు.

తమ అసంతృప్తిని నేరుగా ఆర్ ఎస్ ఎస్ అధినాయకత్వానికే వినిపించే ఉద్దేశం మురళీ మనోహర్ జోషీకి ఉందేమో!

-భరణి

Click to Read: AP CS’s comment leave Government employees squirming

First Published:  24 Nov 2015 1:08 AM GMT
Next Story