Telugu Global
CRIME

పోలీసే కదాని బైక్ ఇచ్చాడు.. కానీ తిరిగి రాలేదు

దొంగలు తెలివిమీరిపోతున్నారు.  ఎదుటి వారిని ఈజీగా బురిడి కొట్టిస్తున్నారు. విశాఖ గాజువాకలో ఒక దొంగగారు ఇలాగే ఓ వ్యక్తికి టోపి పెట్టాడు. వెలుగుల వెంకటరమణ అనే వ్యక్తి దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించాడు. దొంగతనాలు చేయడంతో ఇతడి స్టైలే వేరు. ఇటీవల అలాంటి వింత దొంగతనం ఒకటి చేశాడు. తొలుత చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐ యూనిఫాం దొంగలించాడు.  దాన్ని వేసుకుని దందా మొదలుపెట్టాడు. రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి బైక్‌లో వెళ్తుండగా ఆపిన వెంకటరమణ…సీఐగారికి అర్జంట్‌గా స్వీట్లు తీసుకురావాలి  కాసేపు నీ బైక్ కావాలంటూ తీసుకెళ్లాడు. […]

పోలీసే కదాని బైక్ ఇచ్చాడు.. కానీ తిరిగి రాలేదు
X

దొంగలు తెలివిమీరిపోతున్నారు. ఎదుటి వారిని ఈజీగా బురిడి కొట్టిస్తున్నారు. విశాఖ గాజువాకలో ఒక దొంగగారు ఇలాగే ఓ వ్యక్తికి టోపి పెట్టాడు. వెలుగుల వెంకటరమణ అనే వ్యక్తి దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించాడు. దొంగతనాలు చేయడంతో ఇతడి స్టైలే వేరు. ఇటీవల అలాంటి వింత దొంగతనం ఒకటి చేశాడు. తొలుత చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐ యూనిఫాం దొంగలించాడు. దాన్ని వేసుకుని దందా మొదలుపెట్టాడు.

రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి బైక్‌లో వెళ్తుండగా ఆపిన వెంకటరమణ…సీఐగారికి అర్జంట్‌గా స్వీట్లు తీసుకురావాలి కాసేపు నీ బైక్ కావాలంటూ తీసుకెళ్లాడు. దొంగగారు పోలీస్ యూనిఫాంలో ఉండడంతో సదరు వ్యక్తి కాదనలేక బైక్ ఇచ్చాడు. రోడ్డు పక్కన ఎదురు చూడడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే… బాధితుడి ఫోన్ కూడా బైక్‌ బ్యాగ్‌లోనే ఉండిపోయింది. అలా వెళ్లిన దొంగ పోలీస్ ఎంతకీ తిరిగిరాకపోవడంతో బైక్‌లో ఉన్న తన సెల్‌కు ఫోన్‌ చేశాడు అమాయకుడు. ఫోన్‌ లిప్ట్‌ చేసిన దొంగ సీఐగారు అడిగిన స్వీట్లు ఇక్కడ లేవండి అందుకే మరోచోటికి వెళ్తున్న కాసేపు ఎదురుచూడండి అని చెప్పాడు. కానీ..

గంటలు గడిచినా దొంగగారు తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్. దీంతో గాజువాక పోలీసులను బాధితుడు ఆశ్రయించాడు. పోలీసులు ఆరా తీయగా సదరు దొంగగారు వేసుకుని తిరుగుతున్న ఒరిజినల్ యూనిఫామేనని తేలింది. ఏఎస్‌ఐకు చెందిన యూనిఫాం దొంగిలించి మరీ దాని సాయంతోనే దొంగతనాలు చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యూనిఫాంలో తిరుగుతున్న వెంకటరమణను పట్టుకున్నారు. నాలుగు తన్ని విచారించగా పోలీసు వేషంలో ఇలాంటి మోసాలు చాలానే చేసినట్టు ఒప్పుకున్నాడు. అదన్న మాట పోలీస్ యూనిఫాంలోనూ దొంగలు తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి యూనిఫాం చూసి బైక్ చేతిలో పెడితే ఇలాగే ఉంటుంది.

Click Here to Read : Brahmi wants a hit very badly

First Published:  23 Nov 2015 8:01 PM GMT
Next Story