Telugu Global
National

లాక్కుని కౌగిలించుకున్నారు... కాదనలేకపోయా!

ఇటీవల బీహర్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్ ప్రమాణస్వీకారోత్సవానికి ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌ కూడా హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న లాలూ ప్రసాద్‌ యాదవ్, కేజ్రీవాల్ ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అంతే.. కేజ్రీవాల్‌పై వ్యతిరేకులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు. దాణాకుంభకోణంలో శిక్షపడిన లాలూను ఎలా కౌగిలించుకుంటారని ట్వీట్లు ఎక్కుపెట్టారు. అవినీతిపరులకు దూరంగా ఉంటామని చెప్పే క్రేజీవాల్ ఇప్పుడేం సమాధానం చెబుతారంటూ టార్గెట్ చేశారు. దీంతో చివరకు కేజ్రీవాల్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. […]

లాక్కుని కౌగిలించుకున్నారు... కాదనలేకపోయా!
X

ఇటీవల బీహర్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్ ప్రమాణస్వీకారోత్సవానికి ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌ కూడా హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న లాలూ ప్రసాద్‌ యాదవ్, కేజ్రీవాల్ ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అంతే.. కేజ్రీవాల్‌పై వ్యతిరేకులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు. దాణాకుంభకోణంలో శిక్షపడిన లాలూను ఎలా కౌగిలించుకుంటారని ట్వీట్లు ఎక్కుపెట్టారు. అవినీతిపరులకు దూరంగా ఉంటామని చెప్పే క్రేజీవాల్ ఇప్పుడేం సమాధానం చెబుతారంటూ టార్గెట్ చేశారు. దీంతో చివరకు కేజ్రీవాల్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

తాను ప్రమాణాస్వీకారోత్సవానికి వెళ్లానని ఆ సమయంలో అక్కడే ఉన్న లాలూయే తొలుత తనతో కరచాలనం చేశారని చెప్పారు. తనను లాక్కుని మరి ఆలింగనం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. లాలూ లాక్కుని కౌగిలించుకోవడంతో తానేమీ చేయలేకపోయానని అన్నారు. తాము ఎప్పటికీ అవినీతి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమేనని కేజ్రీ వివరణ ఇచ్చుకున్నారు. అయినా…

ఏదైనా కార్యక్రమానికి వెళ్లినప్పుడు అవతలి వ్యక్తి నీతిపరుడా అవినీతిపరుడా అని చూసి కరచాలనం చేయాలంటే సాధ్యమయ్యే పనేనా?. లాలూ అవినీతిపరుడే అయిఉండవచ్చు కానీ… ఆయనే దగ్గరకు వచ్చి అప్యాయంగా కౌగిలించుకుంటుంటే మీరు అవినీతిపరుడు కాబట్టి కౌగిలించుకోనంటూ తప్పించుకోవడం ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా?. ఈ విషయాన్ని కూడా కేజ్రీవాల్ ప్రత్యర్థులు కాస్త ఆలోచించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

First Published:  23 Nov 2015 7:45 AM GMT
Next Story