Telugu Global
NEWS

పరువు తీసుకుంటున్న చరణ్ విమానం

హీరో రామ్‌చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ట్రూ జెట్ ఎయిర్‌లైన్స్.. సర్వీసులో మాత్రం కావాల్సినంత అపఖ్యాతిని మూటకట్టుకుంటోంది.  హఠాత్తుగా సర్వీసులను రద్దు చేస్తున్న ఎయిర్‌లైన్స్‌లో ట్రాజెట్ నెంబర్‌ వన్‌ స్థానంలో నిలుస్తోంది. అక్టోబర్‌లో సర్వీసులను అత్యధికంగా కాన్సిల్ చేసిన ఎయిర్‌లైన్స్‌గా ట్రూజెట్ నిలిచింది. అక్టోబర్ నెలలో 14. 95 శాతం సర్వీసులను సంస్థ  రద్దు చేసింది. ఆ తర్వాతి స్థానంలో  ఎయిర్‌ కోస్తా నిలిచింది. ఇది అక్టోబర్‌లో 6.87 శాతం సర్వీసులను రద్దు చేసింది.   కస్టమర్ల నుంచి […]

పరువు తీసుకుంటున్న చరణ్ విమానం
X

హీరో రామ్‌చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ట్రూ జెట్ ఎయిర్‌లైన్స్.. సర్వీసులో మాత్రం కావాల్సినంత అపఖ్యాతిని మూటకట్టుకుంటోంది. హఠాత్తుగా సర్వీసులను రద్దు చేస్తున్న ఎయిర్‌లైన్స్‌లో ట్రాజెట్ నెంబర్‌ వన్‌ స్థానంలో నిలుస్తోంది. అక్టోబర్‌లో సర్వీసులను అత్యధికంగా కాన్సిల్ చేసిన ఎయిర్‌లైన్స్‌గా ట్రూజెట్ నిలిచింది. అక్టోబర్ నెలలో 14. 95 శాతం సర్వీసులను సంస్థ రద్దు చేసింది. ఆ తర్వాతి స్థానంలో ఎయిర్‌ కోస్తా నిలిచింది. ఇది అక్టోబర్‌లో 6.87 శాతం సర్వీసులను రద్దు చేసింది.

కస్టమర్ల నుంచి ఫిర్యాదులు కూడా చరణ్ ఎయిర్‌లైన్స్‌పై అధికంగానే వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం తిరుపతి సర్వీసును రద్దు చేయడంతో ప్రయాణికులు శంషాబాద్‌ఎయిర్‌పోర్టులో ధర్నాకు దిగిన ఉదంతం కూడా నమోదైంది. అయితే ఈ పరిస్థితిని అధిగమించేందుకు ట్రూజెట్ సంస్థ పోరాటం చేస్తూనే ఉంది. లోపాలను అధిగమించి అద్బుతమైన సర్వీసులు అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఏ ఎయిర్‌లైన్స్‌కైనా మొదట్లో ఇలాంటి ఇబ్బందులు కామనేనని చెబుతున్నారు. ఇప్పుడొస్తున్న విమర్శలకు సమాధానంగా భవిష్యత్తులో తమ సర్వీసులుంటాయి యాజమాన్యం ధీమాగా చెబుతోంది.

First Published:  21 Nov 2015 9:20 PM GMT
Next Story