Telugu Global
Others

మళ్లీ పెళ్లి చేసుకున్న అజారుద్దీన్

మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులిచ్చిన ఈ మాజీ క్రికెటర్ ఈసారి అమెరికా అమ్మాయిని పరిణయమాడారు. 52 ఏళ్ల అజహార్ అమెరికాకు చెందిన షానన్ మేరీని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల మరణించిన తన కారు డ్రైవర్ జాన్ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లి సమయంలో షానన్‌ను తన భార్యగా అజహార్ పరిచయం చేశారు. 2013 నుంచి వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అజార్‌ తొలుత నౌరీన్‌ను వివాహమాడారు. అయితే తొమ్మిదేళ్ల తర్వాత […]

మళ్లీ పెళ్లి చేసుకున్న అజారుద్దీన్
X

మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులిచ్చిన ఈ మాజీ క్రికెటర్ ఈసారి అమెరికా అమ్మాయిని పరిణయమాడారు. 52 ఏళ్ల అజహార్ అమెరికాకు చెందిన షానన్ మేరీని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల మరణించిన తన కారు డ్రైవర్ జాన్ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లి సమయంలో షానన్‌ను తన భార్యగా అజహార్ పరిచయం చేశారు. 2013 నుంచి వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.

అజార్‌ తొలుత నౌరీన్‌ను వివాహమాడారు. అయితే తొమ్మిదేళ్ల తర్వాత ఆమెకు విడాకులిచ్చారు. అప్పటికే వారికి ఇద్దరు కుమారులు. అనంతరం 1996లో ప్రముఖ మోడల్ సంగీత బిజిలానీని అజార్ పెళ్లి చేసుకున్నారు. 2010లో ఆమెకు కూడా విడాకులిచ్చేసి ఒంటిరిగా ఉన్న అజార్ ఇప్పుడు అమెరికా యువతితో ఒకటయ్యారు. అయితే అజార్ మాత్రం తాను పెళ్లి చేసుకోలేదని చెబుతున్నారు.

First Published:  19 Nov 2015 11:01 PM GMT
Next Story