Telugu Global
NEWS

గ్రహపాటు... బుక్కయ్యారు

రోడ్డు మీద అమ్మాయి కనిపిస్తే చాలు కొందరికి కళ్లు మూసుకుపోతున్నాయి. రోడ్డుమీద అమ్మాయిలు వెళ్తుంటే టీజ్ చేయడం తమ జన్మహక్కు అన్నట్టుగా తయారయ్యారు. ఇలాచిల్లర వేషాలు వేయబోయి విజయవాడలో ఇద్దరు అడ్డంగా దొరికిపోయారు.  ఇద్దరు కానిస్టేబుళ్లు బైక్‌లో వెళ్తుంటే … అమ్మాయిలు బాగానే ఉన్నారు కదాని రంగా, సునీల్ అనే ఇద్దరు యువకులు వెనుకే ఫాలో అయ్యారు. బైక్‌పై రకరకాల విన్యాసాలు చేసుకుంటూ … ఇద్దరు అమ్మాయిలను కామెంట్స్ చేస్తూ వెంబడించారు. ఆ సమయంలో మహిళా కానిస్టేబుళ్లు […]

గ్రహపాటు... బుక్కయ్యారు
X

రోడ్డు మీద అమ్మాయి కనిపిస్తే చాలు కొందరికి కళ్లు మూసుకుపోతున్నాయి. రోడ్డుమీద అమ్మాయిలు వెళ్తుంటే టీజ్ చేయడం తమ జన్మహక్కు అన్నట్టుగా తయారయ్యారు. ఇలాచిల్లర వేషాలు వేయబోయి విజయవాడలో ఇద్దరు అడ్డంగా దొరికిపోయారు. ఇద్దరు కానిస్టేబుళ్లు బైక్‌లో వెళ్తుంటే … అమ్మాయిలు బాగానే ఉన్నారు కదాని రంగా, సునీల్ అనే ఇద్దరు యువకులు వెనుకే ఫాలో అయ్యారు. బైక్‌పై రకరకాల విన్యాసాలు చేసుకుంటూ … ఇద్దరు అమ్మాయిలను కామెంట్స్ చేస్తూ వెంబడించారు. ఆ సమయంలో మహిళా కానిస్టేబుళ్లు యూనిఫాంలో లేకపోవడంతో సాధారణ అమ్మాయిలే అనుకుని రెచ్చిపోయారు. నానా మాటలు అంటూ హింసించారు.

అకతాయిల విన్యాసాలను గమనిస్తూనే మహిళా కానిస్టేబుళ్లు సైలెంట్‌గా తన తోటి పోలీసులకు సమాచారం అందించారు. ఒక ఏరియాలోకి వెళ్లేసరికి అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న పోలీసులకు రంగా, సునీల్ దొరికిపోయారు. పోకిరీలకు నాలుగు తగిలించి స్టేషన్‌ను పట్టుకెళ్లారు పోలీసులు. అదన్నమాట చేతితో బైకుంది కదాని… రోడ్డు మీద అమ్మాయిలు వెళ్తున్నారు కదాని పిచ్చిపిచ్చి వేశాలేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది.

First Published:  17 Nov 2015 11:32 PM GMT
Next Story