Telugu Global
Others

యూపీలోనూ మాయావతి, ములాయం మహాకూటమి?

బీహార్ లో బీజేపీని ఓడించిన మహాకూటమి ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు మార్గదర్శకంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్ లో 2017లో జరగబోయే ఎన్నికల్లో కూడా ఇదే తరహా కూటమి కట్టాలని సమాజ్ వాదీ పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే బీజేపీని అడ్డుకునేందుకు దేనికైనా రెడీ అంటూ యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ సంకేతాలు ఇచ్చారు. యూపీలో మహాకూటమి సాధ్యమేనని ఆయన అన్నారు. బీహార్‌లో రాజకీయ ప్రత్యర్థులైన లాలు, నితీష్‌ కుమార్‌ ఒక్కటై బీజేపీని ఓడించినట్టే.. యూపీలోనూ […]

యూపీలోనూ మాయావతి, ములాయం మహాకూటమి?
X

బీహార్ లో బీజేపీని ఓడించిన మహాకూటమి ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు మార్గదర్శకంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్ లో 2017లో జరగబోయే ఎన్నికల్లో కూడా ఇదే తరహా కూటమి కట్టాలని సమాజ్ వాదీ పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే బీజేపీని అడ్డుకునేందుకు దేనికైనా రెడీ అంటూ యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ సంకేతాలు ఇచ్చారు. యూపీలో మహాకూటమి సాధ్యమేనని ఆయన అన్నారు. బీహార్‌లో రాజకీయ ప్రత్యర్థులైన లాలు, నితీష్‌ కుమార్‌ ఒక్కటై బీజేపీని ఓడించినట్టే.. యూపీలోనూ సమాజ్‌వాదీ పార్టీ, మాయావతి నేతృత్వంలోని బీఎస్‌పీ ఏకమై మహాకూటమి ఏర్పాటు చేయాలని అఖిలేష్ ప్రతిపాదించారు.

నిజానికి 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ మెజారిటీ స్థానాలను స్వీప్ చేసింది. అదే ఉత్సాహంలో 15 ఏళ్ల తరువాత అక్కడ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. అఖిలేష్ హయాంలో జరిగిన దాడులు, బీఎస్పీ హయాంలో జరిగిన అవినీతిని ప్రజలు మర్చిపోలేదేని.. కాంగ్రెస్ కు యూపీలో ఉనికి లేదని.. గెలుపు తమదేనని బీజేపీ ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి చెక్ చెప్పాలంటే యూపీలో మహాకూటమి ఏర్పాటు అవశ్యమని అఖిలేశ్ యాదవ్ భావిస్తున్నారు. సమాజ్ వాదీపార్టీ నుంచి వచ్చిన ప్రతిపాదనకు మాయావతి పార్టీ బీఎస్పీ నుంచి సానుకూల స్పందన రాలేదు. అఖిలేశ్ ప్రతిపాదనను ఆపార్టీ తిరస్కరించింది.

అయితే ఇప్పటికిప్పుడు ఈ పొత్తులు కొలిక్కి రాకపోయినా ఎన్నికలనాటికి ఇది సాధ్యమని ఎస్పీ అంటోంది. కానీ ఇంతకాలం బద్ధ శత్రువులుగా ఉన్న మాయావతి, ములాయం సింగ్ యాదవ్ ఇద్దరూ కలిసి పోటీ చేయడం సాధ్యమేనా? అన్న చర్చ మొదలైంది. బీహార్ లో ఉమ్మడి శత్రువైన బీజేపీని ఓడించేందుకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న లాలూ, నితీష్ ఏకమైనపుడు యూపీలో ఎందుకు సాధ్యం కాదంటున్న వారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో యూపీ రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

First Published:  17 Nov 2015 12:45 AM GMT
Next Story