Telugu Global
Others

చంద్రబాబును ఇలా కూడా వాడుకున్నారు!

ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న జనంపై కేంద్ర ప్రభుత్వం స్వచ్చ భారత్ పేరుతో మరో పన్నుపోటు పొడిచింది. నవంబర్ 15 నుంచి అన్ని రకాల సేవలపై అర శాతం స్వచ్ఛ పన్ను వసూలు చేయనున్నారు. విమానాలు, హోటళ్లు, టెలికామ్ సేవలు, బ్యాంకింగ్ ఇలా అన్ని సేవలకు పన్ను వసూలు చేస్తారు. ఈ పన్ను ద్వారా కేంద్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల కోట్ల ఆదాయం రానుంది. అయితే .. ఈ స్వచ్చ భారత్ పన్ను పెంపు సంగతి […]

చంద్రబాబును ఇలా కూడా వాడుకున్నారు!
X

ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న జనంపై కేంద్ర ప్రభుత్వం స్వచ్చ భారత్ పేరుతో మరో పన్నుపోటు పొడిచింది. నవంబర్ 15 నుంచి అన్ని రకాల సేవలపై అర శాతం స్వచ్ఛ పన్ను వసూలు చేయనున్నారు. విమానాలు, హోటళ్లు, టెలికామ్ సేవలు, బ్యాంకింగ్ ఇలా అన్ని సేవలకు పన్ను వసూలు చేస్తారు. ఈ పన్ను ద్వారా కేంద్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల కోట్ల ఆదాయం రానుంది. అయితే ..

ఈ స్వచ్చ భారత్ పన్ను పెంపు సంగతి ఎలా ఉన్నా… ఈ ఐడియా ఇచ్చింది ఎవరన్నా దానిపై చర్చ జరుగుతోంది. చివరకు అందరి చూపులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైపే మళ్లుతున్నాయి. స్వచ్చ భారత్ పన్ను వాయింపు ఐఢియా చంద్రబాబుదేనని చెబుతున్నారు. ఎందుకంటే దేశాన్ని స్వచ్చంగా మార్చడం ఎలా అన్న దానిపై లోతుగా చర్చించేందుకు స్వచ్చ భారత్ అభియాన్ నీతి అయోగ్ ఉప కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటికి కన్వీనర్‌గా చంద్రబాబే ఉన్నారు. చంద్రబాబే దేశ వ్యాప్తంగా స్వచ్చ భారత్ పన్ను వసూలుకు సిఫార్సు చేశారని చెబుతున్నారు. ఆ సిఫార్సుల ఆధారంగానే కేంద్రం పన్ను విధింపు నిర్ణయం తీసుకుందంటున్నారు. చంద్రబాబు వివిధ కార్పొరేట్ సంస్థలు,చమురు కంపెనీలు వంటి వాటి నుంచి స్వచ్చ పన్ను వసూలుకు సిఫార్పుచేసినట్టు చెప్పారు. కేంద్రం మాత్రం అన్ని సేవలపైనా వడ్డించింది.

టీడీపీ నేతలు మాత్రం ఈ ప్రచారంపై గుర్రుగా ఉన్నారు. కమిటీకి కన్వీనర్‌గా ఉన్నారు కాబట్టి ఏవో కొన్ని సలహాలను చంద్రబాబు ఇచ్చారు. వాటిని అమలు చేయడం పూర్తిగా మోదీ ప్రభుత్వం ఇష్టం. ఒకవేళ పన్ను విధించవద్దని చంద్రబాబు చెబితే కేంద్రం వింటుందా అని ప్రశ్నిస్తున్నారు. డబ్బులు కేంద్రం తీసుకుంటూ నింద మాత్రం చంద్రబాబుపై వేయడం తగదంటున్నారు.

First Published:  7 Nov 2015 12:00 AM GMT
Next Story