Telugu Global
Cinema & Entertainment

కిక్ రావాలంటే ఆయన ఉండాల్సిందే

కిక్-2 సినిమాకు సంబంధించి ఓ సెంటిమెంట్ ఫాలో అవ్వలేకపోయాడు రవితేజ. అందుకే ఆ సినిమా హిట్టవ్వలేదని సెంటిమెంటల్ ప్రచారం కూడా నడిచింది అప్పట్లో. అందుకే సెంటిమెంట్ ను గౌరవిస్తూ.. తన తాజా సినిమాలో కిక్ శ్యామ్ కు చోటిచ్చాడు రవితేజ. ఎవడో ఒకడు మూవీలో రవితేజకు విలన్ గా కిక్ శ్యామ్ నటించనున్నాడు. నిజానికి అప్పట్లో కిక్ సినిమా హిట్టయినప్పుడు అందులో కిక్ శ్యామ్ పాత్ర కూడా చాలా ఉంది. హీరోతో సమానంగా ఎలివేట్ అయింది అతడి […]

కిక్ రావాలంటే ఆయన ఉండాల్సిందే
X

కిక్-2 సినిమాకు సంబంధించి ఓ సెంటిమెంట్ ఫాలో అవ్వలేకపోయాడు రవితేజ. అందుకే ఆ సినిమా హిట్టవ్వలేదని సెంటిమెంటల్ ప్రచారం కూడా నడిచింది అప్పట్లో. అందుకే సెంటిమెంట్ ను గౌరవిస్తూ.. తన తాజా సినిమాలో కిక్ శ్యామ్ కు చోటిచ్చాడు రవితేజ. ఎవడో ఒకడు మూవీలో రవితేజకు విలన్ గా కిక్ శ్యామ్ నటించనున్నాడు.
నిజానికి అప్పట్లో కిక్ సినిమా హిట్టయినప్పుడు అందులో కిక్ శ్యామ్ పాత్ర కూడా చాలా ఉంది. హీరోతో సమానంగా ఎలివేట్ అయింది అతడి రోల్. కానీ కిక్-2కు వచ్చేసరికి శ్యామ్.. కూరలో కరివేపాకు అయిపోయాడు. అందుకే కనీసం తన కొత్త సినిమాతోనైనా ఆ లోటు తీర్చుకుందామని డిసైడ్ అయ్యాడు మాస్ రాజా. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఈమధ్యే కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు రవితేజ. ఈ సినిమాలో మాస్ రాజాకు విలన్ గా కిక్ శ్యామ్ ను తీసుకున్నారు. దిల్ రాజు నిర్మాణసారధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ఎంపికైన ఈ సినిమాలో రావురమేష్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.

First Published:  2 Nov 2015 7:02 PM GMT
Next Story