Telugu Global
Cinema & Entertainment

చిరు సినిమా రీమేక్ రైట్స్ 6 కోట్లు

రీమేక్ సినిమాలో చిరు నటించవద్దని ఓవైపు రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులు గోల పెడుతూనే ఉన్నారు. ఓ స్ట్రయిట్ తెలుగు సినిమాతో చిరంజీవి తన 150వ సినిమాను పట్టాలపైకి తీసుకురావాలని వర్మలానే చాలామంది కోరుకుంటున్నారు. కానీ చిరు మాత్రం మెంటల్లీ ఫిక్స్ అయిపోయాడు. తమిళనాట హిట్ అయిన కత్తి సినిమాను తెలుగులో దించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు కత్తి సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకోవాలని ఆదేశాలు కూడా జారీచేశాడు. ఎలాగూ చిరంజీవి 150వ సినిమాకు నిర్మాత […]

చిరు సినిమా రీమేక్ రైట్స్ 6 కోట్లు
X
రీమేక్ సినిమాలో చిరు నటించవద్దని ఓవైపు రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులు గోల పెడుతూనే ఉన్నారు. ఓ స్ట్రయిట్ తెలుగు సినిమాతో చిరంజీవి తన 150వ సినిమాను పట్టాలపైకి తీసుకురావాలని వర్మలానే చాలామంది కోరుకుంటున్నారు. కానీ చిరు మాత్రం మెంటల్లీ ఫిక్స్ అయిపోయాడు. తమిళనాట హిట్ అయిన కత్తి సినిమాను తెలుగులో దించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు కత్తి సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకోవాలని ఆదేశాలు కూడా జారీచేశాడు. ఎలాగూ చిరంజీవి 150వ సినిమాకు నిర్మాత చెర్రీనే కాబట్టి.. చరణ్ వెంటనే రంగంలోకి దిగిపోయాడు. ఏకంగా 6 కోట్ల రూపాయలకు కత్తి సినిమా రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నాడు. ఈ డీల్ లో పవన్ ఫ్రెండ్ శరత్ మరార్, చెర్రీకి బాగా హెల్ప్ చేశాడట. ప్రస్తుతానికైతే అడ్వాన్స్‌ కింద కత్తి నిర్మాతలకు 2 కోట్ల రూపాయలు చెల్లించాడట చిరు. అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత మిగిలిన 4 కోట్ల రూపాయలను ఇస్తాడట. కేవలం చిరంజీవి మనసుపడ్డాడనే కారణంతోనే కత్తి సినిమాను తెలుగులోకి డబ్బింగ్ కూడా చేయలేదు. మొత్తానికి తాజా పరిణామాలు చూస్తుంటే.. చిరు 150వ సినిమా కత్తి అనే విషయం పక్కా అయింది.
First Published:  20 Oct 2015 1:02 PM GMT
Next Story