Telugu Global
National

ముమైత్ డాన్స్‌ల‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌

ముమైత్‌ఖాన్‌ డాన్స్ చేయాలంటే.. సుప్రీం కోర్టు అనుమ‌తి కావాలా? అని ఆశ్చ‌ర్య‌పోకండి. విష‌య‌మేంటంటే..బార్ డాన్స‌ర్ల‌పై మ‌హారాష్ట్ర స‌ర్కారు విధించిన స్టేను సుప్రీం కోర్టు తొల‌గించింది. ఇక‌పై మ‌హారాష్ట్రలోని డాన్స్‌బార్ల‌ను తెరుచుకోవ‌చ్చ‌ని ఆదేశాలు ఇచ్చింది. 2005లో మ‌హారాష్ట్ర స‌ర్కారు డాన్స్ బార్ల‌పై నిషేధం విధించింది. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌వాలు చేస్తూ.. ఇండియ‌న్ హోట‌ల్ అండ్ రెస్టారెంట్ అసోసియేష‌న్ (ఆహార్‌) సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. 2013లో దీనిపై నిషేధాన్ని తొల‌గించాల‌ని సుప్రీం ఆదేశించింది. దీంతో మ‌హారాష్ట్ర పోలీసు చ‌ట్టం  సెక్ష‌న్- […]

ముమైత్ డాన్స్‌ల‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌
X
ముమైత్‌ఖాన్‌ డాన్స్ చేయాలంటే.. సుప్రీం కోర్టు అనుమ‌తి కావాలా? అని ఆశ్చ‌ర్య‌పోకండి. విష‌య‌మేంటంటే..బార్ డాన్స‌ర్ల‌పై మ‌హారాష్ట్ర స‌ర్కారు విధించిన స్టేను సుప్రీం కోర్టు తొల‌గించింది. ఇక‌పై మ‌హారాష్ట్రలోని డాన్స్‌బార్ల‌ను తెరుచుకోవ‌చ్చ‌ని ఆదేశాలు ఇచ్చింది. 2005లో మ‌హారాష్ట్ర స‌ర్కారు డాన్స్ బార్ల‌పై నిషేధం విధించింది. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌వాలు చేస్తూ.. ఇండియ‌న్ హోట‌ల్ అండ్ రెస్టారెంట్ అసోసియేష‌న్ (ఆహార్‌) సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. 2013లో దీనిపై నిషేధాన్ని తొల‌గించాల‌ని సుప్రీం ఆదేశించింది. దీంతో మ‌హారాష్ట్ర పోలీసు చ‌ట్టం సెక్ష‌న్- 33ఎ ని ప్ర‌వేశ‌పెట్టి 2014లో మ‌రోసారి బ్యాన్ విధించింది. దీంతో ఆహార్‌ రెండోసారి సుప్రీం గ‌డ‌ప తొక్కింది. డాన్స్‌బార్ల‌పై క్ష‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించే ప్ర‌య‌త్నంలో భాగంగా నిషేధం విధించ‌డం స‌రికాద‌ని పిటిష‌న్‌లో పేర్కొంది. కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు దీన్ని వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌గా తీసుకుని పెద్ద‌దిగా చేస్తున్నార‌ని ఆరోపించింది. దీనిపై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు డాన్స్ బార్ల‌కు అనుమ‌తిస్తూ.. గురువారం తీర్పు వెలువ‌రించింది. దీంతో డాన్స్‌బార్ల య‌జ‌మానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.
అచ్చే దిన్ ఆగ‌యే!
అత్యున్న‌త న్యాయ‌స్థానం కోర్టు తీర్పు వెలువ‌రించ‌గానే.. ఈ రంగంపై ఆధార‌ప‌డిన చాలామంది పేద యువ‌తులు, మ‌హిళ‌లు కూడా తిరిగి త‌మ‌కు ఉపాధి ల‌భించ‌నుంద‌న్న వార్త తెలిసి సంతోష ప‌డుతున్నారు. అచ్చే దిన్ ఆగ‌యే (మంచి రోజులు వ‌చ్చేశాయి) అంటూ ముంబైకి చెందిన ఓ బార్‌డాన్స‌ర్ ట్వీట్ చేసింది.
First Published:  15 Oct 2015 10:44 PM GMT
Next Story