Telugu Global
Others

హ‌ర్యానా సీఎం  వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు!

ఏడాది కాలంగా బీజేపీ నేత‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో మోదీ స‌ర్కారుకు అప్ర‌తిష్ట‌ను ఆపాదిస్తున్నారు. ఇటీవ‌లి దాద్రి ఘ‌ట‌న‌తో బీజేపీ ఈ విష‌యంలో మ‌రింత ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. ఈ ఘ‌ట‌న‌పై మోదీ స‌రిగా స్పందించ‌లేద‌ని సాహితీవేత్త‌లు త‌మ పుర‌స్కార‌ల‌ను వాప‌సు ఇచ్చి నిర‌స‌న తెలియజేస్తూనే ఉన్నారు. ఇవి చాల‌వ‌న్న‌ట్లుగా హ‌ర్యానీ సీఎం మ‌నోహ‌ర్ లాల క‌ట్ట‌ర్ మ‌రో తేనెతుట్టెను క‌దిపారు. ఈ దేశంలో ముస్లింలు ఉండాల‌నుకుంటే.. ఆవుమాంసం తిన‌కూడ‌ద‌ని హిత‌వు ప‌లికి అగ్గి రాజేశారు.  ఇఖ్లాక్‌దే త‌ప్పా? హ‌ర్యానాలో […]

హ‌ర్యానా సీఎం  వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు!
X
ఏడాది కాలంగా బీజేపీ నేత‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో మోదీ స‌ర్కారుకు అప్ర‌తిష్ట‌ను ఆపాదిస్తున్నారు. ఇటీవ‌లి దాద్రి ఘ‌ట‌న‌తో బీజేపీ ఈ విష‌యంలో మ‌రింత ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. ఈ ఘ‌ట‌న‌పై మోదీ స‌రిగా స్పందించ‌లేద‌ని సాహితీవేత్త‌లు త‌మ పుర‌స్కార‌ల‌ను వాప‌సు ఇచ్చి నిర‌స‌న తెలియజేస్తూనే ఉన్నారు. ఇవి చాల‌వ‌న్న‌ట్లుగా హ‌ర్యానీ సీఎం మ‌నోహ‌ర్ లాల క‌ట్ట‌ర్ మ‌రో తేనెతుట్టెను క‌దిపారు. ఈ దేశంలో ముస్లింలు ఉండాల‌నుకుంటే.. ఆవుమాంసం తిన‌కూడ‌ద‌ని హిత‌వు ప‌లికి అగ్గి రాజేశారు.
ఇఖ్లాక్‌దే త‌ప్పా?
హ‌ర్యానాలో బీజేపీ ప్ర‌భుత్వం కొలువుదీరి ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా ఆయ‌న ఓఆంగ్ల‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. క‌ట్టార్ ఏమ‌న్నారంటే.. భారత్ లోనే ముస్లింలు జీవనాన్ని కొనసాగించవచ్చు. కానీ ఇక్కడుండాలంటే వారు కచ్చితంగా గోమాంస భక్షణ వదులుకోవాల్సిందే. ఎందుకంటే గోవులు అత్యంత పవిత్రమైనవి. గోమాత, భగవద్గీత, సరస్వతీదేవీలను హిందువులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆవు మాంసం తింటూ ముస్లింలు హిందువుల పవిత్రభావజాలాన్ని అవమానిస్తున్నారు’ అంటూ గోమాంస భక్షకులపై ఖట్టార్ విరుచుకుపడ్డారు. ఇంకా.. ‘మనది ప్రజాస్వామ్యదేశం. ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. కానీ దానికీ ఓ హద్దు ఉంటుంది. ఇతరుల భావాలను భంగం కల్గించనంతవరకే స్వేచ్ఛకు పరిమితి ఉంటుంది’ అని అన్నారు.
సీఎం మాట‌ల‌ను వ‌క్రీక‌రించారా?
క‌ట్టార్ వ్యాఖ్య‌ల‌పై జాతీయ స్థాయిలో తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టార్ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని ఓఎస్డీ జవహర్ యాదవ్ వివరణ ఇచ్చారు. ‘ఒకరినొకరు గౌరవించుకోవాలి’ అనే ఖట్టార్ మాటలను సదరు దినపత్రిక ఉద్దేశపూర్వకంగా వక్రీకరించిందని ఆయన ఆరోపించారు. ఏడాదికాలంగా బీజేపీ నేత‌లు ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నా మోదీ వారిని అదుపు చేయ‌లేక‌పోతున్నార‌ని జాతీయ‌నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. వీరంద‌రికీ ఆర్ ఎస్ ఎస్ నేప‌థ్యం ఉండ‌టం వ‌ల్లే మోదీ వారిని నియంత్రించ‌లేక‌పోతున్నార‌ని మండిప‌డుతున్నారు.
First Published:  16 Oct 2015 4:06 AM GMT
Next Story