Telugu Global
Others

టీడీపీ ప్రభుత్వంపై కాలుదువ్వుతున్న కాపులు

కాపులు ప్రభుత్వంపై కాలు దువ్వుతున్నారు. తమను బీసీల్లో చేరుస్తామని మాట ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ మాట మరిచిపోయి నిర్లక్ష్యం వహిస్తోందని, దీనికి ఎలాగైనా బుద్ది చెప్పాలని భావిస్తున్నారు. ఇందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఒక మంత్రితోసహా కొంతమంది ఎమ్మెల్యేలు, 13 జిల్లాలకు చెందిన ప్రధాన కాపు సంఘాల నాయకులు సమావేశమై ఈ ప్రభుత్వం మెడలు ఎలా వంచాలన్న దానికి వ్యూహరచన చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఏకమై రాజమండ్రిలో సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న […]

టీడీపీ ప్రభుత్వంపై కాలుదువ్వుతున్న కాపులు
X
కాపులు ప్రభుత్వంపై కాలు దువ్వుతున్నారు. తమను బీసీల్లో చేరుస్తామని మాట ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ మాట మరిచిపోయి నిర్లక్ష్యం వహిస్తోందని, దీనికి ఎలాగైనా బుద్ది చెప్పాలని భావిస్తున్నారు. ఇందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఒక మంత్రితోసహా కొంతమంది ఎమ్మెల్యేలు, 13 జిల్లాలకు చెందిన ప్రధాన కాపు సంఘాల నాయకులు సమావేశమై ఈ ప్రభుత్వం మెడలు ఎలా వంచాలన్న దానికి వ్యూహరచన చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఏకమై రాజమండ్రిలో సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మంత్రి మాణిక్యాలరావు, ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బీసీ హోదా సాధనకు కాపు సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలని, వారంలోగా స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు చేసి సీఎంపై ఒత్తిడి తేవాలని 13 జిల్లాల కాపు సంఘాల ప్రతినిధులు నిర్ణయించారు. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అధ్యక్షతన రాజమండ్రి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలో 13 జిల్లాల కాపు సంఘాలు సమావేశమయ్యాయి. కాపులను బీసీలలో చేరుస్తామంటూ మేనిఫెస్టోలో పేర్కొన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, సీఎం సానుకూలంగా ఉన్నప్పటికీ ఒత్తిడి తేకపోవడం వల్ల ఈ అంశంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని రాష్ట్ర మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. కాపు సంఘాల ఆర్గనైజేషన్‌ ఒకటి కావాలని, ఏటా రూ.1000 కోట్లు ఇస్తామన్నా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.50 కోట్లు మాత్రమే ఇచ్చారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ గుర్తు చేశారు. కాపులను బీసీలలో చేర్చుతామని సీఎం హామీ ఇచ్చారని తోట త్రిమూర్తులు గుర్తు చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే రమేష్‌, మాజీ ఎమ్మెల్యే వేదవ్యాస్‌, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌, రిటైర్డ్‌ డీజీపీ భాస్కరరావు, వైసీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి, కాపునాడు నేతలు పిళ్లా వెంకటేశ్వరరావు, చినమిల్లి వెంకట్రాయుడు, యర్రా వేణుగోపాలరాయుడు, పోతుల విశ్వం, అమరనాథ్‌, శివశంకర్‌, దాసరి రాము, ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్‌ నాయుడు, ఎన్‌ఆర్‌ఐ చప్పిడి ప్రసాద్‌, బాలాజీ, కల్వకొలను తాతాజీ, విష్ణు, ఆరేటి ప్రకాష్‌, గిద్దా స్వామినాయుడు పాల్గొన్నారు.
First Published:  14 Oct 2015 10:26 PM GMT
Next Story