Telugu Global
Cinema & Entertainment

బాగా ఎత్తేస్తున్నారు..?

కొత్త  హీరో ఎంట్రీ అంటే కొంత హాడావుడి వుంటుంది. అదే   స్టార్ హీరోల కుటుంబం నుంచి  వ‌స్తున్నాడంటే.. వ్యుహాత్మ‌కంగా అంతులేని ప్ర‌చారం అనేది ఒక‌టి వుంటుంది. ప్ర‌స్తుతం   అక్కినేని నట‌వారుసుడు  అఖిల్ విష‌యంలో అదే జ‌రుగుతుంది. అఖిల్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సినిమా ఇంకా విడుద‌ల కానే లేదు.  త‌న రెండో సినిమాకు  సంబంధించి రెమ్యున్ రేష‌న్  విష‌యంలో  రూమ‌ర్స్ ప్రారంభం అయ్యాయి. ‘అఖిల్’ సినిమా విడుదల ముందే వస్తున్న రెస్పాన్స్ చూసి….ఓ నిర్మాత అఖిల్ రెండో […]

బాగా ఎత్తేస్తున్నారు..?
X

కొత్త హీరో ఎంట్రీ అంటే కొంత హాడావుడి వుంటుంది. అదే స్టార్ హీరోల కుటుంబం నుంచి వ‌స్తున్నాడంటే.. వ్యుహాత్మ‌కంగా అంతులేని ప్ర‌చారం అనేది ఒక‌టి వుంటుంది. ప్ర‌స్తుతం అక్కినేని నట‌వారుసుడు అఖిల్ విష‌యంలో అదే జ‌రుగుతుంది. అఖిల్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సినిమా ఇంకా విడుద‌ల కానే లేదు. త‌న రెండో సినిమాకు సంబంధించి రెమ్యున్ రేష‌న్ విష‌యంలో రూమ‌ర్స్ ప్రారంభం అయ్యాయి.
‘అఖిల్’ సినిమా విడుదల ముందే వస్తున్న రెస్పాన్స్ చూసి….ఓ నిర్మాత అఖిల్ రెండో సినిమా కోసం 12 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారట. ఈ రేంజి రెమ్యూనరేషన్ ప్రస్తుతం రామ్ చరణ్, అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్, రవితేజ లాంటి వారికే ఉంది. మరి ఇంకా ఓనమాలు దశలోనే ఉన్న అఖిల్ కు నిర్మాత రూ. 12 కోట్లు ఆఫర్ చేసాడనే వార్త ఇపుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది. ఇదంతా ప్ర‌చార ప‌టోట‌మే అంటున్నారు కొంద‌రు ప‌రిశీల‌కులు. రెండో సినిమాకే 12 కోట్లు ఇచ్చేటంత మార్కెట్ అఖిల్ కు రాలేదు. ఆ రేంజ్ కు రీచ్ కావ‌లంటే.. క‌నీసం వ‌ర‌స‌గా ఓ అర‌డ‌జ‌ను బంప‌ర్ హిట్స్ కొడితే త‌ప్ప సాధ్యం కాదు మ‌రి.!

First Published:  9 Oct 2015 7:05 PM GMT
Next Story