Telugu Global
NEWS

దీక్ష మూడో రోజు- రేపు ప్రత్యేక వైద్య పరీక్షలు

ప్రత్యేక హోదా కోసం గుంటూరు సమీపంలోని నల్లపాడు వద్ద ప్రతిపక్ష నేత జగన్‌ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది.  ఉదయం గుంటూరు ప్రభుత్వ డాక్టర్లు ఆయనకు  వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, సుగర్ లెవల్స్‌లో పెద్దగా మార్పు లేదని గుర్తించారు.  అయితే మూడు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో జగన్ నీరసించిపోయారు. ప్రస్తుతం బీపీ 110/70, షుగర్ లెవల్స్   94 ఎంజీగా ఉంది.  దీక్ష ఇలాగే కొనసాగిస్తే శనివారం ప్రత్యేక వైద్య పరీక్షలు చేయాల్సి […]

దీక్ష మూడో రోజు-  రేపు ప్రత్యేక వైద్య పరీక్షలు
X

ప్రత్యేక హోదా కోసం గుంటూరు సమీపంలోని నల్లపాడు వద్ద ప్రతిపక్ష నేత జగన్‌ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. ఉదయం గుంటూరు ప్రభుత్వ డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, సుగర్ లెవల్స్‌లో పెద్దగా మార్పు లేదని గుర్తించారు. అయితే మూడు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో జగన్ నీరసించిపోయారు. ప్రస్తుతం బీపీ 110/70, షుగర్ లెవల్స్ 94 ఎంజీగా ఉంది. దీక్ష ఇలాగే కొనసాగిస్తే శనివారం ప్రత్యేక వైద్య పరీక్షలు చేయాల్సి రావచ్చని వైద్యులు తెలిపారు. మరోవైపు పలు జిల్లాల నుంచి జగన్‌ దీక్షకు మద్దతుగా ప్రజలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. తెలంగాణ నుంచి కూడా పలువురు జగన్‌ను కలిశారు.

First Published:  9 Oct 2015 12:34 AM GMT
Next Story