Telugu Global
Cinema & Entertainment

ఎటాక్ కి రెడి అవుతున్న వర్మ, మనోజ్

రామ్ గోపాల్ వర్మ-మంచు మనోజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఎటాక్. ఈమధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాల్లో కాస్త పెద్ద సినిమాగానే దీన్ని చెప్పుకోవాలి. ఎందుకుంటే.. మంచు మనోజ్-సురభి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటులు కూడా నటించారు. పైగా ఫస్ట్ ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై కాస్తోకూస్తో అంచనాలు కూడా పెరిగాయి. కానీ సినిమా విడుదలపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. […]

ఎటాక్ కి రెడి అవుతున్న వర్మ, మనోజ్
X
రామ్ గోపాల్ వర్మ-మంచు మనోజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఎటాక్. ఈమధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాల్లో కాస్త పెద్ద సినిమాగానే దీన్ని చెప్పుకోవాలి. ఎందుకుంటే.. మంచు మనోజ్-సురభి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటులు కూడా నటించారు. పైగా ఫస్ట్ ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై కాస్తోకూస్తో అంచనాలు కూడా పెరిగాయి. కానీ సినిమా విడుదలపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ ఇంకా విడుదలకాలేదు. తాజాగా ఈరోజు మరో ట్రయిలర్ కూడా విడుదల చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఈ రోజు విడుదలచేసే ట్రయిలర్ లో సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాతో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు మంచు మనోజ్. రామ్ గోపాల్ వర్మ తీసిన కిల్లింగ్ వీరప్పన్ సినిమా కంటే ముందే ఎటాక్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.
First Published:  6 Oct 2015 7:03 PM GMT
Next Story