Telugu Global
NEWS

హీరో త‌నీష్ పై హిట్ అండ్ ర‌న్, న్యూసెన్స్ కేసు

హిట్‌లు లేక‌పోయినా..హిట్ అండ్ ర‌న్ కేసు మాత్రం ఉంది. న్యూస్ క్రియేట్ చేసే స్థాయిలో కెరీర్ బిల్డ‌ప్ కాక‌పోయినా..న్యూసెన్స్ చేసి కేసులు ఎదుర్కొనే స్థితికి చేరాడు న‌చ్చావులే ఫేం హీరో త‌నీష్. సినిమా ప‌రిశ్ర‌మ‌లో యువ‌హీరోలు ఇటీవ‌ల కాలంలో వ‌రుస‌గా వార్త‌ల్లోకెక్కుతున్నారు. కొంత‌మంది డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటుంటే, మ‌రికొంద‌రు న‌డిరోడ్ల‌పై హీరోయిజం చూపిస్తున్నారు. తాజాగా  హీరో తనీష్‌పై న్యూసెన్స్ కేసు న‌మోదైంది.  గురువారం రాత్రి తనీష్ తన కారులో జూబ్లీహిల్స్ ఏరియాలో ఓ బైక్‌ను ఢీకొట్టాడు. హిట్ […]

హీరో త‌నీష్ పై హిట్ అండ్ ర‌న్, న్యూసెన్స్ కేసు
X

హిట్‌లు లేక‌పోయినా..హిట్ అండ్ ర‌న్ కేసు మాత్రం ఉంది. న్యూస్ క్రియేట్ చేసే స్థాయిలో కెరీర్ బిల్డ‌ప్ కాక‌పోయినా..న్యూసెన్స్ చేసి కేసులు ఎదుర్కొనే స్థితికి చేరాడు న‌చ్చావులే ఫేం హీరో త‌నీష్. సినిమా ప‌రిశ్ర‌మ‌లో యువ‌హీరోలు ఇటీవ‌ల కాలంలో వ‌రుస‌గా వార్త‌ల్లోకెక్కుతున్నారు. కొంత‌మంది డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటుంటే, మ‌రికొంద‌రు న‌డిరోడ్ల‌పై హీరోయిజం చూపిస్తున్నారు. తాజాగా హీరో తనీష్‌పై న్యూసెన్స్ కేసు న‌మోదైంది. గురువారం రాత్రి తనీష్ తన కారులో జూబ్లీహిల్స్ ఏరియాలో ఓ బైక్‌ను ఢీకొట్టాడు. హిట్ ర‌న్..అంటే స‌ల్మాన్ స్టైల్‌లో జంపిచ్చాడు. త‌నీష్ కారును ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన బైక్‌వాలా వెంటాడి మ‌రీ నిలిపాడు. సీను జూబ్లీహిల్స్ చెక్ పోస్టు ద‌గ్గ‌ర‌కు మారింది. త‌నీష్ కారుకు అడ్డంగా బైక్‌ను నిలిప‌డంతో..స‌ద‌రు హీరోగారికి ప‌ట్ట‌రాని కోపం వ‌చ్చేసింది. ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ పెద్ద‌దైంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇద్ద‌రిపైనా జూబ్లీహిల్స్ పోలీసులు న్యూసెన్స్ కేసు న‌మోదు చేశారు. అయితే స‌ద‌రు హీరోగారు మ‌ద్యం మ‌త్తులో ఉన్నార‌ని ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వ్య‌క్తి చెబుతున్నాడు. పోలీసులు మ‌రి హీరోగారికి మ‌ద్యం తాగి ఉన్నాడా లేదా అనే ప‌రీక్ష నిర్వ‌హించారో లేదో తెలియాల్సి ఉంది.

బాల‌నటుడిగా వ‌చ్చి..
‘దేవుళ్లు’ మూవీలో బాల అయ్యప్పగా నటించిన తనీష్.. హీరోగా కూడా ‘నచ్చావులే తొలి చిత్రం మంచి హిట్ అందుకుంది. పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌లో ఓ పాత్ర పోషించిన త‌నీష్, రైడ్, ‘మేం వయసుకు వచ్చాం’ వంటి సినిమాల్లో హీరోగా చేశాడు. ‘తెలుగబ్బాయి’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అది కాకుండా తనీష్ నటిస్తున్న ‘ఓకే’ మరియు ‘చాణక్యుడు’ అనే రెండు థ్రిల్లర్ చిత్రాలు ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మంచి కెరీర్ ఉన్న యంగ్‌హీరో ఇలా న‌డిరోడ్ల‌పై న్యూసెన్స్ కు పాల్ప‌డ‌డం సినిమా ఇండ‌స్ర్టీకి కొత్త కాక‌పోయినా.. ఆయా హీరోల కెరీర్‌పై తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని ఫిల్మ్ క్రిటిక్స్ అంటున్నారు.

First Published:  2 Oct 2015 12:51 AM GMT
Next Story