Telugu Global
Cinema & Entertainment

చిరు 150 వ సినిమా క‌త్తి కానుందా..!

మెగా అభిమానులకు ఇది శుభవార్తే. చిరంజీవి చేయబోయే 150వ సినిమా ఖరారైంది. తమిళంలో సూపర్ హిట్టయిన ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. చెన్నై నుండి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఈ చిత్రం రీమేక్ రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి డబల్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా విషయమై రామ్ చరణ్ అఫీషియల్ ప్రకటన చేసే అవకాశం ఉంది. దర్శకుడు ఎవరు […]

చిరు 150 వ సినిమా క‌త్తి కానుందా..!
X

మెగా అభిమానులకు ఇది శుభవార్తే. చిరంజీవి చేయబోయే 150వ సినిమా ఖరారైంది. తమిళంలో సూపర్ హిట్టయిన ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. చెన్నై నుండి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఈ చిత్రం రీమేక్ రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి డబల్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా విషయమై రామ్ చరణ్ అఫీషియల్ ప్రకటన చేసే అవకాశం ఉంది. దర్శకుడు ఎవరు అనేది ఫైనల్ చేసిన తర్వాత ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు రాంచ‌ర‌ణ్ స‌న్నిహిత‌ల టాక్.

టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ముర‌గ‌దాస్ క‌త్తి సినిమాను డైరెక్ట్ చేశారు. రైతు స‌మ‌స్య‌ను డీల్ చేస్తు చేసిన ఈ చిత్రం త‌మిళ‌నాట మంచి విజ‌యం సాధించింది. గ‌త యేడాది తెలుగులో ఈ సినిమాను ఠాగుర‌ధ్ మధు.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్, జూనియ‌ర్ ఎన్టీఆర్ ల‌ను రీమేక్ కోసం సంప్ర‌దించారు. అయితే వారిద్ద‌రు ఈసినిమా రీమేక్ పై పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌ప‌ర‌చ లేదు. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మ హ‌త్య‌లు ఎక్కువుగా జ‌రుగుతుండ‌టంతో.. రైతుల ప‌క్షాన వుండే చిత్ర క‌థ చేస్తే.. సందేశంతో పాటు.. చిరు స్టార్ డ‌మ్ కు ..ఆయ‌న వ‌య‌సుకు ..అభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు ఉంటుంద‌ని మెగా స్టార్ ఆలోచ‌న‌గా తెలుస్తుంది మ‌రి. మొత్తం మీద చిరు 150 సినిమా క‌త్తి లా వుంటుంద‌న్న‌మాట‌.

First Published:  1 Oct 2015 5:17 AM GMT
Next Story