Telugu Global
Others

ప్రాణం తీసిన సెల్ఫీ స‌ర‌దా!

సెల్ఫీలు ప్రాణాంత‌క‌మ‌ని ఎంత‌మంది మొత్తుకుంటున్నా.. ప‌లు ఘ‌ట‌న‌లు ఆ విష‌యాన్ని రుజువు చేస్తున్నా.. యువ‌త తీరులో మార్పురావ‌డం లేదు. వాటిని తీసుకునే ప్ర‌య‌త్నంలో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా సెల్ఫీ తీసుకునే క్ర‌మంలో త‌మిళ‌నాడుకు చెందిన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి  ప్రాణాలు కోల్పోయాడు. త‌మిళ‌నాడులోని న‌మ‌క్క‌ల్ ప్రాంతానికి చెందిన ప్ర‌కాశ్ అనే విద్యార్థి త‌న స్నేహితుల‌తో క‌లిసి స‌ర‌దాగా కోలీ హిల్స్ కు వెళ్లాడు. అక్క‌డ జ‌ల‌పాతంలో స్నానం చేస్తూ సెల్ఫీలు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌కాశ్ […]

సెల్ఫీలు ప్రాణాంత‌క‌మ‌ని ఎంత‌మంది మొత్తుకుంటున్నా.. ప‌లు ఘ‌ట‌న‌లు ఆ విష‌యాన్ని రుజువు చేస్తున్నా.. యువ‌త తీరులో మార్పురావ‌డం లేదు. వాటిని తీసుకునే ప్ర‌య‌త్నంలో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా సెల్ఫీ తీసుకునే క్ర‌మంలో త‌మిళ‌నాడుకు చెందిన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. త‌మిళ‌నాడులోని న‌మ‌క్క‌ల్ ప్రాంతానికి చెందిన ప్ర‌కాశ్ అనే విద్యార్థి త‌న స్నేహితుల‌తో క‌లిసి స‌ర‌దాగా కోలీ హిల్స్ కు వెళ్లాడు. అక్క‌డ జ‌ల‌పాతంలో స్నానం చేస్తూ సెల్ఫీలు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌కాశ్ ఓ అడుగు ముందుకేశాడు. అంద‌రికంటే విభిన్నంగా సెల్ఫీ తీసుకోవాల‌నే ఆతృత‌లో జ‌ల‌పాతం అంచుకు వెళ్లి..లోయ‌ భాగం క‌నిపించేలా సెల్ఫీ తీసుకుందామ‌నుకున్నాడు. ఇంత‌లో తాను నిలుచుకున్న రాయి దొర్ల‌డంతో ప‌ర్వ‌తం పైనుంచి ప్ర‌కాశ్ లోయ‌లో ప‌డిపోయి మ‌ర‌ణించాడు. ప్ర‌పంచంలో షార్క్ చేప‌ల దాడుల క‌న్నా సెల్ఫీలు తీసుకునే య‌త్నంలోనే ఎక్కువ మంది మ‌ర‌ణిస్తున్నార‌ని ఇటీవ‌ల ఓ స‌ర్వేలో తేలింది కూడా. అయినా.. ఈవిష‌యంలో యువ‌త తీరు మార‌క‌పోవడం దుర‌దృష్ట‌క‌రం.

First Published:  29 Sep 2015 1:09 PM GMT
Next Story