Telugu Global
Others

రేవంత్ బెయిల్ రద్దుకు పిటిషన్

రేవంత్ స్పీడుకు క‌ళ్లెం వేసే ప‌నిలో ప‌డింది ఏసీబీ. ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఏసీబీ పోలీసుల‌కు దొరికిన‌ప్ప‌టి నుంచి రేవంత్ రెడ్డి దూకుడు పెరుగుతోందే కానీ, ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. కోర్టు బెయిల్ మంజూరు చేసే స‌మ‌యంలో నిబంధ‌న‌ల‌ను పాటిస్తాన‌ని చెప్పిన రేవంత్ ఇప్ప‌డు వాటిని ఉల్లంఘిస్తున్నాడ‌ని ఏసీబీ ఆరోపిస్తుంది. రెచ్చ‌గొట్టే  ప్ర‌సంగాల‌తో సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తున్నాడ‌ని, అత‌ని బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ  హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. కోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రేవంత్‌రెడ్డి ఉల్లంఘిస్తున్నాడ‌ని […]

రేవంత్ బెయిల్ రద్దుకు పిటిషన్
X
రేవంత్ స్పీడుకు క‌ళ్లెం వేసే ప‌నిలో ప‌డింది ఏసీబీ. ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఏసీబీ పోలీసుల‌కు దొరికిన‌ప్ప‌టి నుంచి రేవంత్ రెడ్డి దూకుడు పెరుగుతోందే కానీ, ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. కోర్టు బెయిల్ మంజూరు చేసే స‌మ‌యంలో నిబంధ‌న‌ల‌ను పాటిస్తాన‌ని చెప్పిన రేవంత్ ఇప్ప‌డు వాటిని ఉల్లంఘిస్తున్నాడ‌ని ఏసీబీ ఆరోపిస్తుంది. రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాల‌తో సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తున్నాడ‌ని, అత‌ని బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. కోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రేవంత్‌రెడ్డి ఉల్లంఘిస్తున్నాడ‌ని పిటిష‌న్‌లో ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోల‌ను కూడా జ‌త చేసింది. ఈ పిటిష‌న్‌ను హైకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఈ పిటిష‌న్ నేడు (శుక్ర‌వారం) విచార‌ణ‌కు రానుంది. రేవంత్ బెయిల్ నిబంధ‌న‌ల‌ను కోర్టు స‌డ‌లించాక ఇటీవ‌ల‌ హైద‌రాబాద్‌లో స‌భ పెట్టాడు. సీఎం కేసీఆర్‌పై నోటి కొచ్చిన‌ట్లు విమ‌ర్శ‌లు చేశాడు. తాను హైద‌రాబాద్ వ‌స్తున్నాని తెలిసి సీఎం భ‌యంతో చైనా పారిపోయాడంటూ అహంకారపూరిత‌ వ్యాఖ్య‌లు చేశాడు. నేరం చేస్తుండ‌గా ప‌ట్టుబ‌డ్డ వ్య‌క్తి.. త‌న‌కు సాక్షాత్తూ సీఎం భ‌య‌ప‌డుతున్నాడ‌ని దుందుడుకు వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని ఏసీబీ తీవ్రంగా తీసుకుంది. ఇది సాక్షుల‌ను ప్ర‌భావితం చేసే చ‌ర్య‌గానే భావించింది. అందుకే అత‌ని బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది.
First Published:  16 Sep 2015 8:49 PM GMT
Next Story