Telugu Global
Others

బాస్‌ కూతురి దెబ్బ... దేశ బహిష్కరణ

అస్ట్రేలియాలో ఇంజినీర్‌గా పని చేస్తున్న భారత సంతతికి చెందిన ఓ యువకుడు బాస్‌ కూతురితో ప్రేమలో పడ్డాడు. తనకిష్టం లేదని ఎంతమొత్తుకున్నా… నాకిష్టం లేదని మొర పెట్టుకున్నా వినలేదీ విక్రమార్కుడు. నువ్వు తప్ప నేనెవరినీ ఇష్టపడనని, వెంట పడుతూ టీజింగ్‌ చేశాడు. తప్పని పరిస్థితిలో ఆమె పోలీసులను ఆశ్రయించి తన గోడు వెళ్ళబోసుకుంది. అభినవసింగ్‌ అనే ఈ లవర్‌ని పిలిచారు పోలీసులు. మందలించారు. అయినా వినలేదు. ‘బాస్‌ కూతురు అయితే ప్రేమించకూడదా… వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరా’ అంటూ […]

అస్ట్రేలియాలో ఇంజినీర్‌గా పని చేస్తున్న భారత సంతతికి చెందిన ఓ యువకుడు బాస్‌ కూతురితో ప్రేమలో పడ్డాడు. తనకిష్టం లేదని ఎంతమొత్తుకున్నా… నాకిష్టం లేదని మొర పెట్టుకున్నా వినలేదీ విక్రమార్కుడు. నువ్వు తప్ప నేనెవరినీ ఇష్టపడనని, వెంట పడుతూ టీజింగ్‌ చేశాడు. తప్పని పరిస్థితిలో ఆమె పోలీసులను ఆశ్రయించి తన గోడు వెళ్ళబోసుకుంది. అభినవసింగ్‌ అనే ఈ లవర్‌ని పిలిచారు పోలీసులు. మందలించారు. అయినా వినలేదు. ‘బాస్‌ కూతురు అయితే ప్రేమించకూడదా… వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరా’ అంటూ లాజిక్‌ తీశాడు. అయినా వార్నింగ్‌ ఇచ్చి వదిలేశారు పోలీసులు. కథ మామూలే. మళ్ళీ టీజింగ్‌లు… ఎస్సెమ్మెస్‌లతో వేధింపులు. మళ్ళీ పోలీసుల జోక్యంతో ఈసారి కథ కోర్టు దాకా వెళ్ళింది. న్యాయమూర్తి ముందు తాను ప్రేమించిన మాట వాస్తవమేనని, వెంట పడుతున్న విషయమూ నిజమేనని ఒప్పుకున్నాడు. అయితే ఈసారి పోలీసుల మాదిరిగా జడ్జి వార్నింగ్‌ ఇచ్చి వదిలేయలేదు. దేశాన్ని విడిచి పొమ్మని, వెళ్ళే ముందు 2000 డాలర్ల జరిమానా చెల్లించమని ఆదేశించారు. భారత్‌లో జన్మించి కెనడా పాస్‌పోర్టుతో క్వీన్స్‌ల్యాండ్‌లో ఉద్యోగం చేస్తున్న ఇతగాడు పెట్టేబేడా సర్దుకుని ఆస్ట్రేలియా నుంచి పలాయనం చిత్తగించాడు!
First Published:  14 Sep 2015 1:06 PM GMT
Next Story