Telugu Global
Others

విమానంలో పక్క తడిపాడు!

విమానం గాలిలో ఉండగా అందరి మాదిరిగానే ఓ ప్రయాణికుడు తన సీట్లో కునుకుతీశాడు. విమానం ల్యాండవుతుండగా మేల్కొని.. సీట్లోనే మూత్రవిసర్జన చేశాడు. ఆపుకోలేకపోయాడో.. కావాలనే చేశాడో తెలియదు కానీ.. అమెరికాకు చెందిన 27ఏండ్ల జెఫ్ రుబిన్ అనే ప్రయాణికుడు తన తోటి ప్రయాణికుల సీటు దగ్గర మూత్రవిసర్జన చేశాడు. ముందుసీట్లోని ప్రయాణికుల దుస్తులు, లగేజీ తడిసిపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతగాడ్ని పోలీసులు జైలుకు తరలించారు. జెట్‌బ్లూ ఫ్లయిట్ 47లో ఈ సంఘటన జరిగింది. […]

విమానం గాలిలో ఉండగా అందరి మాదిరిగానే ఓ ప్రయాణికుడు తన సీట్లో కునుకుతీశాడు. విమానం ల్యాండవుతుండగా మేల్కొని.. సీట్లోనే మూత్రవిసర్జన చేశాడు. ఆపుకోలేకపోయాడో.. కావాలనే చేశాడో తెలియదు కానీ.. అమెరికాకు చెందిన 27ఏండ్ల జెఫ్ రుబిన్ అనే ప్రయాణికుడు తన తోటి ప్రయాణికుల సీటు దగ్గర మూత్రవిసర్జన చేశాడు. ముందుసీట్లోని ప్రయాణికుల దుస్తులు, లగేజీ తడిసిపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతగాడ్ని పోలీసులు జైలుకు తరలించారు. జెట్‌బ్లూ ఫ్లయిట్ 47లో ఈ సంఘటన జరిగింది. జెఫ్ రుబిన్‌ను పోలీసులు అరెస్టు చేసి.. ఐదుగంటలపాటు జైల్లో ఉంచారు. తాను కావాలని చేయలేదని, నిద్రలో పక్క తడిపే అలవాటు ఉందని, అందుకే అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చాడు.
First Published:  13 Sep 2015 1:05 PM GMT
Next Story