Telugu Global
Others

పార్లమెంటు ప్రోరోగ్‌... రాష్ట్రపతి ఉత్తర్వులు

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ఇక అవకాశం లేదు. ఉభయసభలను ప్రోరోగ్‌ చేసినట్లు పేర్కొంటూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఉత్తర్వు జారీచేయడమే ఇందుకు కారణం. ఈ మేరకు తమకు సమాచారం అందిందని రాజ్యసభ, లోక్‌సభల సెక్రటేరియట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఈ ఏడాది జూలై 21న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగిసి, నిరవధికంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. కీలకమైన వస్తుసేవల (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం ప్రోరోగ్‌కు […]

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ఇక అవకాశం లేదు. ఉభయసభలను ప్రోరోగ్‌ చేసినట్లు పేర్కొంటూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఉత్తర్వు జారీచేయడమే ఇందుకు కారణం. ఈ మేరకు తమకు సమాచారం అందిందని రాజ్యసభ, లోక్‌సభల సెక్రటేరియట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఈ ఏడాది జూలై 21న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగిసి, నిరవధికంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. కీలకమైన వస్తుసేవల (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం ప్రోరోగ్‌కు సిఫారసు చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసినా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ ససేమిరా అనడంతో ఆ యోచనను విరమించుకుని పార్లమెంటును ప్రోరోగ్‌ చేయాల్సిందిగా రాష్ట్రపతికి సిఫారసు చేసింది.
First Published:  11 Sep 2015 1:14 PM GMT
Next Story