కొరాటల కోసం హీరోల పోటి...!
ఇండస్ట్రీలో సక్సెస్ కే అగ్ర తాంబులం. ఎన్ని సార్లు చెప్పుకున్న ఇది శాశ్విత సత్యం లాంటింది. దర్శకుల విషయంలో హీరోలు హిట్స్ ఇచ్చిన వాళ్లకు త్వరగా డేట్స్ ఇస్తుంటారు. తాజాగా శ్రీమంతుడు చిత్రంతో డైరెక్టర్ గా తన సత్తాను చాటుకున్న కొరటాల శివ కోసం మన స్టార్ హీరోలు పోటి పడుతున్నారంటే అతిశయోక్తి కాదు. మిర్చి చిత్రంతో డెబ్యూ గా పరిచయమైన కొరటాల శివ. ఆ తరువాత గ్యాప్ తీసుకుని మహేష్ బాబు తో శ్రీమంతుడు చిత్రం […]
BY admin8 Sep 2015 7:30 PM GMT
X
admin Updated On: 8 Sep 2015 11:07 PM GMT
ఇండస్ట్రీలో సక్సెస్ కే అగ్ర తాంబులం. ఎన్ని సార్లు చెప్పుకున్న ఇది శాశ్విత సత్యం లాంటింది. దర్శకుల విషయంలో హీరోలు హిట్స్ ఇచ్చిన వాళ్లకు త్వరగా డేట్స్ ఇస్తుంటారు. తాజాగా శ్రీమంతుడు చిత్రంతో డైరెక్టర్ గా తన సత్తాను చాటుకున్న కొరటాల శివ కోసం మన స్టార్ హీరోలు పోటి పడుతున్నారంటే అతిశయోక్తి కాదు. మిర్చి చిత్రంతో డెబ్యూ గా పరిచయమైన కొరటాల శివ. ఆ తరువాత గ్యాప్ తీసుకుని మహేష్ బాబు తో శ్రీమంతుడు చిత్రం చేశాడు. చిన్న పాటి పాయింట్ ను క్లాస్ గా తెరకెక్కించి ఒక బిగ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ తోపాటు.. మిగిలిన స్టార్ హీరోలందరి దృష్టి కొరటాల శివ పైనే ఉంది. మెగా హీరో బన్నీ అయితే ఏకంగా కొరటాల శివ కు అడ్వాన్స్ ఇచ్చి.. కథను సిద్దం చేయమన్నారనే టాక్ వినిపిస్తుంది. వాస్తవంగా శ్రీమంతుడి కంటే ముందే.. ఎన్టీఆరో్ తో చేయాల్సి వుంది. కానీ..అది ట్రాక్ ఎక్కలేదు. అయితే శ్రీమంతుడు తరువాత ఎన్టీఆర్తో ఉండొచ్చని భావిస్తే.. బన్నీ తన్నుకు పోయినట్లు టాక్ వినిపిస్తుంది. మిర్చి తరువాత చాల మంది హీరోలు .. కొరటాల శివ డైరెక్షన్ పై పూర్తిగా నమ్మకం ఉంచలేదు. ఏదో గాలి వాటంగా తగిలింది అనుకున్నారు. కానీ శ్రీమంతుడితో తన టాలెంట్ ను ఘనంగా చాటుకున్నాడు. బాహుబలి తరువాత అత్యధిక వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. దీంతో ఇప్పుడు కొరటాల శివ కోసం హీరోలు వెయిట్ చేయడం ప్రారంభించారు మరి. ఇట్స్ ది పవర్ ఆఫ్ సక్సెస్.

Next Story