Telugu Global
Cinema & Entertainment

అఖిల్ కోసం మూడో సంగీత దర్శకుడు

అఖిల్ సినిమాకు ఇప్పటికే ఇద్దరు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. సినిమాలో కొన్ని పాటల్ని తమన్ కంపోజ్ చేస్తే.. మరికొన్ని పాటల్ని అనూప్ రూబెన్స్ స్వరపరిచాడు. ప్రస్తుతం ఈ పాటల షూటింగ్ లోనే అఖిల్ బిజీగా ఉన్నాడు. అయితే ఈ ఇద్దరు సంగీత దర్శకులు కాకుండా ముచ్చటగా మూడో సంగీత దర్శకుడ్ని కూడా అఖిల్ సినిమా కోసం తీసుకున్నారు. అతడే సంగీత దర్శకుడు మణిశర్మ. అవును.. అవకాశాల్లేక సతమతమవుతున్న మణిశర్మ ఊహించని విధంగా అఖిల్ సినిమాను దక్కించుకున్నాడు. అయితే […]

అఖిల్ కోసం మూడో సంగీత దర్శకుడు
X
అఖిల్ సినిమాకు ఇప్పటికే ఇద్దరు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. సినిమాలో కొన్ని పాటల్ని తమన్ కంపోజ్ చేస్తే.. మరికొన్ని పాటల్ని అనూప్ రూబెన్స్ స్వరపరిచాడు. ప్రస్తుతం ఈ పాటల షూటింగ్ లోనే అఖిల్ బిజీగా ఉన్నాడు. అయితే ఈ ఇద్దరు సంగీత దర్శకులు కాకుండా ముచ్చటగా మూడో సంగీత దర్శకుడ్ని కూడా అఖిల్ సినిమా కోసం తీసుకున్నారు. అతడే సంగీత దర్శకుడు మణిశర్మ. అవును.. అవకాశాల్లేక సతమతమవుతున్న మణిశర్మ ఊహించని విధంగా అఖిల్ సినిమాను దక్కించుకున్నాడు. అయితే అందులో పాటలు కంపోజ్ చేయట్లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే అందిస్తాడు. బీజీఎం అందించడంలో అందరికంటే దిబెస్ట్ అనిపించుకున్నాడు మణిశర్మ. సంగీత దర్శకత్వం వహించకపోయినప్పటికీ ఎన్నో సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఆ అనుభవమే అఖిల్ సినిమా కూడా వచ్చేలా చేసింది. ప్రస్తుతం మణిశర్మ బీజీఎం పనిలో పడిపోయాడు. మరోవైపు అఖిల్ ఆస్ట్రేలియాలో ఓ పాట షూటింగ్ లో ఉన్నాడు. తర్వాత స్పెయిన్ లో మరో సాంగ్ షూట్ చేస్తారు. వీవీ వినాయక్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సాయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది.
First Published:  6 Sep 2015 7:03 PM GMT
Next Story