Telugu Global
Others

దూకుడు పెంచి కట్టడి చేయండి: మోడితో ఆరెస్సెస్‌

నరేంద్ర మోడీ పాలనపై ఆరెస్సెస్ పెద్దలు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు కొన్ని కీలక అంశాలపై దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో భారతీయతకు సంబంధించిన అంశాలు చేర్చాలని సూచించినట్టు సమాచారం. పార్లమెంటును స్తంభింపజేస్తున్న కాంగ్రెస్, విపక్షాలను కట్టడి చేయడానికి అవసరమైతే దూకుడు పెంచాలని నిర్దేశించింది. ఢిల్లీలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ మేధో మధనం కార్యక్రమంలో నరేంద్ర మోడీ సర్కారు ఏడాదిన్నర పాలనపై ఆరెస్సెస్ చీఫ్‌ మోహన్ భగవత్‌తోపాటు […]

దూకుడు పెంచి కట్టడి చేయండి: మోడితో ఆరెస్సెస్‌
X
నరేంద్ర మోడీ పాలనపై ఆరెస్సెస్ పెద్దలు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు కొన్ని కీలక అంశాలపై దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో భారతీయతకు సంబంధించిన అంశాలు చేర్చాలని సూచించినట్టు సమాచారం. పార్లమెంటును స్తంభింపజేస్తున్న కాంగ్రెస్, విపక్షాలను కట్టడి చేయడానికి అవసరమైతే దూకుడు పెంచాలని నిర్దేశించింది. ఢిల్లీలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ మేధో మధనం కార్యక్రమంలో నరేంద్ర మోడీ సర్కారు ఏడాదిన్నర పాలనపై ఆరెస్సెస్ చీఫ్‌ మోహన్ భగవత్‌తోపాటు కీలక నేతలు కూలంకషంగా చర్చించినట్టు తెలిసింది. ప్రభుత్వ విధానాలు, పథకాలు, దేశ భద్రత, ప్రజా సమస్యలు, రామమందిరం, మంత్రులపై అవినీతి ఆరోపణలు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్, గంగా ప్రక్షాళన, కాశ్మీర్ పండిట్ల పునరావాసం సహా అనేక అంశాలపై ప్రభుత్వ పెద్దలతో ఆరెస్సెస్ అగ్రనాయకులు చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశంలోనే తమతమ శాఖల ప్రగతి నివేదికలను కొందరు మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించినట్టు తెలుస్తోంది.
ఆరెస్సెస్‌తో ప్రభుత్వ సమావేశం రాజ్యాంగ విరుద్దం: కాంగ్రెస్
మరోవైపు ఆరెస్సెస్‌తో ప్రధాని, కేంద్రమంత్రుల సమావేశం రాజ్యాంగ విరుద్దమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఆరెస్సెస్ చెప్పినట్టు బీజేపీ పాలకులు ఆడుతున్నారన్న విషయం ఈ మీటింగ్‌తో మరోసారి తేటతెల్లమైందని ఆరోపించింది. అయితే కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు ఆరెస్సెస్ నేతలు. తాము కూడా దేశ పౌరులమేనని, మంత్రులు మీడియాతో మాట్లాడినట్టు తమతోనూ అనేక విషయాలు పంచుకున్నారని సమర్థించుకున్నారు.
First Published:  5 Sep 2015 3:43 AM GMT
Next Story