Telugu Global
Others

రోడ్డు దాటుతూ యువత మృత్యువాత!

భారత్‌లో రోడ్డు దాటుతుండగా గత యేడాది 75 వేల మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 82 శాతం మంది కూడా యువత కావటం గమనార్హం. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ గణాంకాల ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారిలో 15 నుంచి 34 వయుస్సు గల యువత శాతం 53.8%. ప్రపంచంలో రోడ్డు ప్రమాదంలో 15 నుంచి 29 వయస్సు గల యువత సంఖ్యే 3 లక్షల 40 వేల మందిగా ఉంది. […]

రోడ్డు దాటుతూ యువత మృత్యువాత!
X
భారత్‌లో రోడ్డు దాటుతుండగా గత యేడాది 75 వేల మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 82 శాతం మంది కూడా యువత కావటం గమనార్హం. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ గణాంకాల ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారిలో 15 నుంచి 34 వయుస్సు గల యువత శాతం 53.8%. ప్రపంచంలో రోడ్డు ప్రమాదంలో 15 నుంచి 29 వయస్సు గల యువత సంఖ్యే 3 లక్షల 40 వేల మందిగా ఉంది. ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల గురించి తెలుపుతూ ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. 2014వ సంవత్సరంలో 4 లక్షల 89 వేల మంది యువత రోడ్డు దాటడంలో చనిపోయారు. అంతకుముందు యేడాదితో పోలిస్తే 2014 వ సంవత్సరానికి మృతుల సంఖ్య పెరిగింది. ఇలా చనిపోతున్నవారిలో 9వ స్థానంలో తెలంగాణ ఉండగా, 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.
First Published:  2 Sep 2015 1:07 PM GMT
Next Story