Telugu Global
Others

పట్టిసీమతో 7 లక్షల ఎకరాలకు నీరు: బుచ్చయ్య

పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఏడు లక్షల ఎకరాలకు నీరు ఇవ్వవచ్చని తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చెప్పారు. పట్టిసీమపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. పట్టిసీమపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అనవసర ఆరోపణలు చేస్తున్నదని, అసలు ఆ స్కీంపై ఆ పార్టీ వైఖరి స్పష్టం చేయాలని ఆయన అన్నారు. ఆ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ ఈ ప్రాజెక్టు విషయంలో గందరగోళంలో ఉన్నారని బుచ్చయ్య చౌదరి అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగేళ్లు పడుతుందని, ఈలోగా […]

పట్టిసీమతో 7 లక్షల ఎకరాలకు నీరు: బుచ్చయ్య
X
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఏడు లక్షల ఎకరాలకు నీరు ఇవ్వవచ్చని తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చెప్పారు. పట్టిసీమపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. పట్టిసీమపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అనవసర ఆరోపణలు చేస్తున్నదని, అసలు ఆ స్కీంపై ఆ పార్టీ వైఖరి స్పష్టం చేయాలని ఆయన అన్నారు. ఆ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ ఈ ప్రాజెక్టు విషయంలో గందరగోళంలో ఉన్నారని బుచ్చయ్య చౌదరి అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగేళ్లు పడుతుందని, ఈలోగా పట్టిసీమ ద్వారా ఏడు లక్షల ఎకరాలకు నీరు ఇవ్వవచ్చని ఆయన అన్నారు. ఎకరానికి 30 బస్తాల దిగుబడి వస్తుందనుకున్నా రైతులకు ఎంత ఆదాయం చేకూరుతుందో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు అర్ధం చేసుకోవాలని ఆయన లెక్కలు చెప్పారు. కృష్ణా నదిపై ఎగువన ప్రాజెక్టులు కట్టడంతో ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని, గతంలో ఆల్మట్టి ఎత్తు పెంచకుండా ఆపిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు.
First Published:  1 Sep 2015 1:14 PM GMT
Next Story