Telugu Global
Others

మంత్రి మెడకు 'పత్తి' కొనుగోళ్ళ అవినీతి!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం సైకిల్ స్పీడ్‌లో నడుస్తున్నా అవినీతి మాత్రం జెట్‌ స్పీడ్‌లో నడుస్తోంది. కొంతమంది మంత్రులు ఇసుకతో కోట్లు వెనకేసుకుంటుంటే మరికొంతమంది అవినీతికి ఎక్కడ ఆస్కారముందా అని వెతుక్కుని అక్కడ వాలిపోతున్నారు. ఇలా పచ్చచొక్కా ప్రభుత్వంలో మంత్రులు అడ్డంగా సంపాదించుకుంటుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కిమ్మనకుండా ఉంటున్నారు. ఇలా తెగబడి సంపాదించుకుంటున్న మంత్రుల్ని చంద్రబాబు చూసీచూడనట్టు వదిలేస్తున్నాడా లేక చేవ చచ్చి చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతున్నాడా అన్న సందేహం కలుగుతోంది. హుద్‌హుద్‌ తుఫాన్‌ విశాఖపట్నం వాసులకు విషాదం […]

మంత్రి మెడకు పత్తి కొనుగోళ్ళ అవినీతి!
X
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం సైకిల్ స్పీడ్‌లో నడుస్తున్నా అవినీతి మాత్రం జెట్‌ స్పీడ్‌లో నడుస్తోంది. కొంతమంది మంత్రులు ఇసుకతో కోట్లు వెనకేసుకుంటుంటే మరికొంతమంది అవినీతికి ఎక్కడ ఆస్కారముందా అని వెతుక్కుని అక్కడ వాలిపోతున్నారు. ఇలా పచ్చచొక్కా ప్రభుత్వంలో మంత్రులు అడ్డంగా సంపాదించుకుంటుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కిమ్మనకుండా ఉంటున్నారు. ఇలా తెగబడి సంపాదించుకుంటున్న మంత్రుల్ని చంద్రబాబు చూసీచూడనట్టు వదిలేస్తున్నాడా లేక చేవ చచ్చి చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతున్నాడా అన్న సందేహం కలుగుతోంది. హుద్‌హుద్‌ తుఫాన్‌ విశాఖపట్నం వాసులకు విషాదం మిగిల్చిన సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రిగారిని అక్కడి ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వ నిధులతో నిత్యావసర సరుకులు పంపించి… పంపిణీ చేయమని సీఎం ఆదేశించారు. సదరు మంత్రిగారు తనకు, తన పరివారానికి చెందినవారి గోదాముల నుంచి కారాన్ని ఈ సరుకులకు జత చేశారు. ఇలా సేకరించిన కారానికి బిల్లులు మాత్రం వరంగల్‌ జిల్లా నుంచి తెప్పించి ప్రభుత్వానికి సమర్పించారు. ఈ డీల్‌లో దాదాపు 150 కోట్ల రూపాయల మేరకు సదరు మంత్రిగారు నొక్కేశారని విశ్వసనీయవర్గాల కథనం. అలాగే గుంటూరు జిల్లాలోనే పత్తి కొనుగోళ్ళ వ్యవహారంలో కూడా ఈ మంత్రిగారు తన చేతి వాటం చూపించారట. పత్తి కొనుగోళ్ళలో తన అధికారాన్ని ఉపయోగించి దాదాపు రూ. 300 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని వినికిడి. అయితే చంద్రబాబుకు ఈ విషయాలన్నీ తెలుసునని, త్వరలో జరగబోయే కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణలో ఇలాంటి మంత్రులకు తగిన గుణ‌పాఠం చెబుతారని అంటున్నారు మరో వర్గం సభ్యులు. మొత్తం మీద ఏపీలో చంద్రబాబు కన్నా అవినీతే ఎక్కువ రాజ్యమేలుతుందన్న మాట!
First Published:  22 Aug 2015 3:03 AM GMT
Next Story