Telugu Global
Others

ప‌ట్టిసీమ దారిలోనే తోట‌ప‌ల్లి!

ప‌నులు పూర్తికాకుండానే ప్రారంభోత్స‌వానికి స‌న్నాహాలు వెన‌కాముందు చూసుకోకుండా అల‌వికాని హామీలు కురిపించేయ‌డం ఆన‌క నాలుక క‌రుచుకోవ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు మామూలే. రైతు రుణ‌మాఫీ, డ్వాక్రా రుణ‌మాఫీ, ఇంటికో ఉద్యోగం ఇలా ఎన్నో హామీల‌ను ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్పుకోవ‌చ్చు. ప‌ట్టిసీమ‌ను ఆగ‌స్లు 15నాటికి పూర్తి చేసి డెల్టాలో నీళ్లు పారిస్తామ‌ని అసెంబ్లీ సాక్షిగా స‌వాల్ చేసిన చంద్ర‌బాబు ఆ మాటను నిల‌బెట్టుకున్నామ‌ని చెప్పుకోవ‌డం కోసం స‌రిగ్గా ఆగ‌స్టు 15న ప‌ట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం […]

ప‌ట్టిసీమ దారిలోనే తోట‌ప‌ల్లి!
X
ప‌నులు పూర్తికాకుండానే ప్రారంభోత్స‌వానికి స‌న్నాహాలు
వెన‌కాముందు చూసుకోకుండా అల‌వికాని హామీలు కురిపించేయ‌డం ఆన‌క నాలుక క‌రుచుకోవ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు మామూలే. రైతు రుణ‌మాఫీ, డ్వాక్రా రుణ‌మాఫీ, ఇంటికో ఉద్యోగం ఇలా ఎన్నో హామీల‌ను ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్పుకోవ‌చ్చు. ప‌ట్టిసీమ‌ను ఆగ‌స్లు 15నాటికి పూర్తి చేసి డెల్టాలో నీళ్లు పారిస్తామ‌ని అసెంబ్లీ సాక్షిగా స‌వాల్ చేసిన చంద్ర‌బాబు ఆ మాటను నిల‌బెట్టుకున్నామ‌ని చెప్పుకోవ‌డం కోసం స‌రిగ్గా ఆగ‌స్టు 15న ప‌ట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేసేశారు. అక్క‌డ అస‌లు ప‌నులేమీ పూర్తికాకుండానే, నీళ్లు లేకుండానే ప్రాజెక్టును ప్రారంభించ‌డం, జాతికి అంకితం చేయ‌డం చూసి జ‌నం నివ్వెర పోయారు. ఎవ‌రేమ‌నుకున్నా చంద్ర‌బాబు పెద్ద‌గా లెక్క‌చేయ‌రు. ప‌నులు పూర్తి చేయ‌కుండా జ‌రుగుతున్న ప్రారంభోత్స‌వాల‌ను చూసి జ‌నం న‌వ్వుకుంటున్నారు. ప‌ట్టిసీమ దారిలోనే మ‌రో ప్రాజెక్టును ప్రారంభించ‌బోతున్నారు. అదే తోట‌ప‌ల్లి. తోట‌ప‌ల్లి బ్యారేజీ ప‌నులు పూర్తికాకుండానే ప్రారంభించ‌డం కోసం చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తోంది. ఖ‌రీఫ్ ప్రారంభం నాటికే ప్రాజెక్టు ప‌నులు పూర్తి చేస్తామ‌ని హామీ ఇచ్చినందున క‌నీసం ఇప్పుడైనా ప్రారంభించేసి మ‌మ అనిపిద్దామ‌ని చంద్ర‌బాబు ఆలోచిస్తున్నారు. అయితే ఇంకా ప‌నులు 20 శాతం పూర్తికావ‌ల‌సి ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం 110 ఎక‌రాల భూమిని రైతుల నుంచి సేక‌రించాల్సి ఉంది కూడా. బ్యారేజీ హెడ్‌వర్క్సు పనులు, 117 కిలోమీటర్ల మేర కుడి, ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ బ్యారేజీ హెడ్‌వర్క్సు, మెయిన్‌ కెనాల్‌ పనులు మాత్రమే పూర్తయ్యాయి. సీతానగరం మండలం సువర్ణముఖి నదిపై నిర్మించిన అక్విడెక్ట్‌ నెల రోజుల క్రితం ట్రయల్‌ రన్‌లో కొట్టుకుపోయింది. దీని పునర్‌ నిర్మాణ పనులు ఈ నెలాఖరులోగా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఆ వెంటనే బ్యారేజీని ముఖ్య‌మంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారని అధికారులు చెప్తున్నారు. ప్రారంభోత్స‌వం కోసం ఇప్పటికే పైలాన్‌, శిలాఫలకం సిద్ధం చేశారు. మైనర్‌, సబ్‌మైనర్‌ కెనాళ్ల పనులు పూర్తి కాకుండా బ్యారేజీ ప్రారంభిస్తే పెద్దగెడ్డ ఆయకట్టుదారులకు పట్టిన గతే తమకూ పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీతానగరం మండలం మీదుగా కుడికాలువ వెళ్తున్నప్పటికీ దానికి అనుసంధానంగా పిల్ల కాలువలు నేటికీ ఏర్పాటు చేయలేదు. దీంతో, తమకు ఎలా నీరందుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. చివరి ఆయకట్టుదారులదీ అదే పరి స్థితి. ఇండియన్‌ రైల్వే అనుమతులు లేకపోవడంతో గరివిడి ట్రాక్‌ కిందనుంచి అక్విడెక్ట్‌ నిర్మాణ పనులు నేటికీ ప్రారంభం కాలేదు. దీంతో, ఈ అక్విడెక్ట్‌ తర్వాత ఉన్న ఆరు వేల ఎకరా లకు సాగునీరందే పరిస్థితి లేదు. గజపతినగరం బ్రాంచి కెనాల్‌ పనులూ చేపట్టలేదు. ఈ కెనాల్‌ కింద ఉన్న 15 వేల ఎకరాలకూ నీరందదని అధికారులే అంగీకరిస్తున్నారు. తోటపల్లి బ్యారేజీ ద్వారా ప్ర‌స్తుతం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 64 వేల ఎకరాలకు సాగునీరందుతోంది. మరో లక్షా 35 వేల ఎకరాలకు నీటి వసతి కల్పించే లక్ష్యంతో రూ.744.90 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులకు 2003లో శంకుస్థాపన చేశారు. ఇవి పూర్తయితే విజయనగరం జిల్లాలో పార్వతీపురం, గరుగుబిల్లి, బలిజిపేట, సీతానగరం, బొబ్బిలి, తెర్లాం, బాడంగి, చీపురుపల్లి, గరివిడి, గుర్ల, నెలిమర్ల, పూసపాటిరేగ, శ్రీకాకుళం జిల్లాలోని ఏడు మండలాల్లో లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది.
First Published:  21 Aug 2015 8:54 PM GMT
Next Story