Telugu Global
Others

చినబాబు లోకేశ్‌ నిర్ణయానికి దెబ్బ?

చినబాబు నిర్ణయానికి త్వరలో దెబ్బ తగలనుందా? అవుననే అంటున్నారు తెలుగుదేశం పార్టీలోని కొంతమంది పెద్దలు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేరుకు కొంచెం అటుఇటుగా ఒక పదాన్ని రూపొందించారు చినబాబు లోకేశ్‌. అదే ఎమ్మెల్వో. ఈ పదమంటేనే ఇపుడు మంత్రుల్లో కొంతమంది ఒంటికాలిపై లేస్తున్నారు. ఎమ్మెల్వో అంటే మీడియా లైజనింగ్‌ ఆఫీసర్‌! అంటే ప్రజా సంబంధాల అధికారుల స్థానంలో చినబాబు ఖరారు చేసిన పోస్టిది. ఆ ఉద్యోగాన్ని తమ కదలికలపై కన్నేసేందుకే చినబాబు సృష్టించారంటూ ఈమధ్య చంద్రబాబు వద్ద కొంతమంది […]

చినబాబు లోకేశ్‌ నిర్ణయానికి దెబ్బ?
X
చినబాబు నిర్ణయానికి త్వరలో దెబ్బ తగలనుందా? అవుననే అంటున్నారు తెలుగుదేశం పార్టీలోని కొంతమంది పెద్దలు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేరుకు కొంచెం అటుఇటుగా ఒక పదాన్ని రూపొందించారు చినబాబు లోకేశ్‌. అదే ఎమ్మెల్వో. ఈ పదమంటేనే ఇపుడు మంత్రుల్లో కొంతమంది ఒంటికాలిపై లేస్తున్నారు. ఎమ్మెల్వో అంటే మీడియా లైజనింగ్‌ ఆఫీసర్‌! అంటే ప్రజా సంబంధాల అధికారుల స్థానంలో చినబాబు ఖరారు చేసిన పోస్టిది. ఆ ఉద్యోగాన్ని తమ కదలికలపై కన్నేసేందుకే చినబాబు సృష్టించారంటూ ఈమధ్య చంద్రబాబు వద్ద కొంతమంది మంత్రులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మంత్రుల పేషీల్లో పని చేసేందుకు ఏర్పాటు చేసిన మీడియా లైజనింగ్‌ అధికారులకు, మంత్రులకు మధ్య అగాధం రోజురోజుకూ పెరగడమే దీనికి కారణమంటున్నారు. కేవలం నలుగురైదుగురు మంత్రులు మాత్రమే వీరి కొనసాగింపునకు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. అది కూడా చినబాబు వద్ద దూరం పెరగకుండా ఉండడానికేనట.
అటు ప్రభుత్వానికి, ఇటు మంత్రుల పేషీలకు అనుసంధానకర్తలుగా ఉండేందుకే ఎమ్మెల్వోలను నియమించారని చినబాబు మనుషులు చెబుతుండగా… తమ కదలికలపై నిఘా పెట్టేందుకే ఈ వ్యవస్థను తమపై రుద్దారని మంత్రులంటున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఇదే అంశాన్ని కొందరు మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలిసింది. మంత్రులు దేవినేని ఉమ, రావెల కిషోర్‌బాబు తమ వద్ద పని చేస్తున్న ఎమ్మెల్వోలను వెనక్కి పంపించాలని నిర్ణయించుకున్నారట. ఇక మరో మంత్రి నారాయణ అయితే మొదటి నుంచి ఎమ్మెల్వో తనకు అక్కర్లేదని నిరాకరిరచినట్లు చెబుతున్నారు. నలుగురైదుగురు మంత్రులు తప్ప మిగిలిన వారంతా ఈ వ్యవస్థపై విముఖంగానే ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద చినబాబు నిర్ణయానికి తొలిసారి వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ అంశంపై చంద్రబాబు మంత్రులకు ఓటేస్తారో… చినబాబు నిర్ణయాన్ని సమర్ధిస్తారో వేచి చూడాల్సిందే!
First Published:  21 Aug 2015 4:12 AM GMT
Next Story