Telugu Global
Others

దీపాల్లేక మూడు దీపాలు ఆరిపోయాయి

ఆస్ప‌త్రిలో ఆరు గంట‌లు క‌రెంటు పోయింది. ముగ్గురు శిశువుల‌ను బ‌లితీసుకుంది. త‌ల్లిదండ్రుల కంటి వెలుగుల్ని చిదిమేసింది. ఆగ్రాలోని ఎస్ఎన్ మెడిక‌ల్ కాలేజ్ హాస్పిట‌ల్లో ఈ విషాదం చోటుచేసుకుంది. నియోనేట‌ల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఐదు నుంచి 15 రోజుల వ‌య‌సున్నశిశువులు క‌రెంటు లేక అల్లాడిపోయారు. ఆరు గంట‌ల‌పాటు క‌రెంటు లేక‌పోవ‌డంతో వెంటిలేటర్‌పై ఉన్న పిల్ల‌లు లైఫ్ స‌పోర్ట్ సిస్ట‌మ్ ప‌నిచేయ‌క విల‌విల్లాడారు. ఫ‌లితంగా ముగ్గురు శిశువులు ప్రాణాలు విడిచారు. పిల్ల‌ల ఎమ‌ర్జెన్సీ వార్డులో క‌నీసం దీపాలు కూడా లేవ‌ని […]

ఆస్ప‌త్రిలో ఆరు గంట‌లు క‌రెంటు పోయింది. ముగ్గురు శిశువుల‌ను బ‌లితీసుకుంది. త‌ల్లిదండ్రుల కంటి వెలుగుల్ని చిదిమేసింది. ఆగ్రాలోని ఎస్ఎన్ మెడిక‌ల్ కాలేజ్ హాస్పిట‌ల్లో ఈ విషాదం చోటుచేసుకుంది. నియోనేట‌ల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఐదు నుంచి 15 రోజుల వ‌య‌సున్నశిశువులు క‌రెంటు లేక అల్లాడిపోయారు. ఆరు గంట‌ల‌పాటు క‌రెంటు లేక‌పోవ‌డంతో వెంటిలేటర్‌పై ఉన్న పిల్ల‌లు లైఫ్ స‌పోర్ట్ సిస్ట‌మ్ ప‌నిచేయ‌క విల‌విల్లాడారు. ఫ‌లితంగా ముగ్గురు శిశువులు ప్రాణాలు విడిచారు.

పిల్ల‌ల ఎమ‌ర్జెన్సీ వార్డులో క‌నీసం దీపాలు కూడా లేవ‌ని త‌ల్లిదండ్రులు చెబుతున్నారు. వైద్య సిబ్బంది నిర్ల‌క్ష్యానికి త‌మ పిల్ల‌లు బ‌లైపోయార‌ని క‌న్నీరుమున్నీర‌య్యారు. డాక్ట‌ర్లు మాత్రం..ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తోనే చిన్నారులు చ‌నిపోయార‌ని వాదిస్తున్నారు. అయితే ఆరు గంట‌ల‌పాటు వెంటిలేట‌ర్లు ప‌నిచేయ‌లేద‌నీ, వేడిని భ‌రించ‌లేకే శిశువులు ప్రాణాలు కోల్పోయార‌ని త‌ల్లిదండ్రులంటున్నారు. ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో ఆగ్రా వైద్య సిబ్బంది నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించార‌ని ఆరోపిస్తున్నారు.

First Published:  12 Aug 2015 1:15 PM GMT
Next Story