Telugu Global
Others

1000 కిలోమీటర్ల మానవహారంతో కేరళ రికార్డు

పోరాట పటిమను వారసత్వంగా పొందిన కేరళ ప్రజలు మరోసారి చరిత్ర పుటలకెక్కారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సంపన్న అనుకూల ఆర్థిక విధానాలు, మతతత్వానికి వ్యతిరేకంగా మంగళవారం వెయ్యి కిలోమీటర్ల మానవహారాన్ని నిర్మించి రికార్డు సృష్టించారు. సామాన్యుల జీవితాల్ని అత్యంత దయనీయంగా మార్చి వేస్తున్న విధానాలపై సమరభేరి మోగిస్తూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ నిరసన ప్రదర్శనకు కదలి వచ్చారు. సిపిఎం కేంద్ర కమిటి ఇచ్చిన నిరసన పిలుపునకు దాదాపు 25లక్షల మంది ప్రజలు స్పందించారు. […]

పోరాట పటిమను వారసత్వంగా పొందిన కేరళ ప్రజలు మరోసారి చరిత్ర పుటలకెక్కారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సంపన్న అనుకూల ఆర్థిక విధానాలు, మతతత్వానికి వ్యతిరేకంగా మంగళవారం వెయ్యి కిలోమీటర్ల మానవహారాన్ని నిర్మించి రికార్డు సృష్టించారు. సామాన్యుల జీవితాల్ని అత్యంత దయనీయంగా మార్చి వేస్తున్న విధానాలపై సమరభేరి మోగిస్తూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ నిరసన ప్రదర్శనకు కదలి వచ్చారు. సిపిఎం కేంద్ర కమిటి ఇచ్చిన నిరసన పిలుపునకు దాదాపు 25లక్షల మంది ప్రజలు స్పందించారు. ఈ నిరసన ప్రదర్శన కేరళలోని మారుమూల గ్రామమైన మంజేశ్వరం నుంచి రాజ్‌భవన్‌ వరకు కొనసాగింది. దాదాపు అన్ని జాతీయ రహదార్లు, రాష్ట్ర రహదారులపై కూడా మానవహార కార్యక్రమం కొనసాగింది. మానవహారానికి సమాంతరంగా 500 బహిరంగ సభలు కూడా జరిగాయి. ప్రజావ్యతిరేక విధానాలకు వెంటనే ఇరు ప్రభుత్వాలు చరమగీతం పాడాలని ప్రదర్శకులు కోరారు.
First Published:  12 Aug 2015 1:12 PM GMT
Next Story