Telugu Global
Others

దయానిధి మారన్‌కు సుప్రీంలో ఊరట

కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అనధికారిక టెలిఫోన్‌ ఎక్చ్సేంజ్‌ ఏర్పాటు చేసిన కేసులో మారన్‌కు బెయిల్‌ను రద్దు చేసిన మద్రాస్‌ హైకోర్టు మూడు రోజుల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ దయానిధి మారన్‌ సుప్రీంను ఆశ్రయించగా విచారించిన కోర్టు మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి ఆదేశాలు వెల్లడయ్యే వరకు అరెస్ట్‌ చేయవద్దని సీబీఐని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సెప్టెంబర్‌ 14 […]

దయానిధి మారన్‌కు సుప్రీంలో ఊరట
X
కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అనధికారిక టెలిఫోన్‌ ఎక్చ్సేంజ్‌ ఏర్పాటు చేసిన కేసులో మారన్‌కు బెయిల్‌ను రద్దు చేసిన మద్రాస్‌ హైకోర్టు మూడు రోజుల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ దయానిధి మారన్‌ సుప్రీంను ఆశ్రయించగా విచారించిన కోర్టు మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి ఆదేశాలు వెల్లడయ్యే వరకు అరెస్ట్‌ చేయవద్దని సీబీఐని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సెప్టెంబర్‌ 14 వరకు మారన్‌ అరెస్ట్‌ను నిలిపి వేయడంతో పాటు సీబీఐకి నోటీసులు జారీ చేసింది.
First Published:  11 Aug 2015 1:09 PM GMT
Next Story