Telugu Global
Others

పురాత‌న క‌ట్ట‌డాల‌ ప‌రిర‌క్షణకు జేఏసీ

రాజ‌ధాని న‌గ‌రంలోని పురాత‌న కట్ట‌డాల‌ను, క్రీడా స్థలాల‌ను  కాపాడేందుకు ఐక్య కార్య‌చ‌ర‌ణ‌ క‌మిటీ (జేఏసీ) ఏర్పాటైంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ పురాత‌న క‌ట్ట‌డాలు, భ‌వ‌నాల‌పై త‌రుచూ వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. దీంతో, వాటిని ప‌రిర‌క్షించేందుకు జేఏసీ ఏర్పాటైంది. ఉస్మానియా ఆస్ప‌త్రి భ‌వ‌నాన్ని, ఎన్టీఆర్ గ్రౌండ్‌, ఛాతీ ఆస్ప‌త్రి, సెక్ర‌టేరియ‌ట్ తో పాటు కేసీఆర్ క‌న్ను ప‌డిన ప్ర‌తి భ‌వ‌నాన్ని కాపాడుతామ‌ని నూత‌న జేఏసీ ప్ర‌క‌టించింది. ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే హైద‌రాబాద్ లోని పురాత‌న క‌ట్ట‌డాల‌ను […]

రాజ‌ధాని న‌గ‌రంలోని పురాత‌న కట్ట‌డాల‌ను, క్రీడా స్థలాల‌ను కాపాడేందుకు ఐక్య కార్య‌చ‌ర‌ణ‌ క‌మిటీ (జేఏసీ) ఏర్పాటైంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ పురాత‌న క‌ట్ట‌డాలు, భ‌వ‌నాల‌పై త‌రుచూ వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. దీంతో, వాటిని ప‌రిర‌క్షించేందుకు జేఏసీ ఏర్పాటైంది. ఉస్మానియా ఆస్ప‌త్రి భ‌వ‌నాన్ని, ఎన్టీఆర్ గ్రౌండ్‌, ఛాతీ ఆస్ప‌త్రి, సెక్ర‌టేరియ‌ట్ తో పాటు కేసీఆర్ క‌న్ను ప‌డిన ప్ర‌తి భ‌వ‌నాన్ని కాపాడుతామ‌ని నూత‌న జేఏసీ ప్ర‌క‌టించింది. ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే హైద‌రాబాద్ లోని పురాత‌న క‌ట్ట‌డాల‌ను చారిత్ర‌క సంప‌ద‌గా గుర్తించాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితికి లేఖ రాసార‌ని, ఆ త‌ర్వాత మ‌న‌సు మార్చుకుని పురాత‌న క‌ట్ట‌డాల‌ను కూల్చి వేసి ప్రైవేట్ సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని జేఏసీ ఆరోపించింది. అయితే, ముఖ్య‌మంత్రి ఆట‌లు సాగ‌నీయ‌మ‌ని జేఏసీ హెచ్చ‌రించింది.
First Published:  10 Aug 2015 1:13 PM GMT
Next Story