Telugu Global
Cinema & Entertainment

శ్రీమంతుడు ఓకే.. ఇక రుద్రమ వంతు..

ఇప్పటివరకు మూడంటే మూడే సినిమాలు అందర్నీ ఆకర్షించాయి. వీటిలో ఒకటి బాహుబలి. ఏడాదిన్నరగా ఊరించిన ఈ సినిమా విడుదలై అఖండ విజయం సాధించింది. తర్వాత అందర్నీ ఎట్రాక్ట్ చేసిన మూవీ శ్రీమంతుడు. దాదాపు 6నెలలుగా అందరి నోట్లో నానిన ఈ మూవీ కూడా విడదలై పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన మూవీ రుద్రమదేవి. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఈ ఏడాది […]

శ్రీమంతుడు ఓకే.. ఇక రుద్రమ వంతు..
X
ఇప్పటివరకు మూడంటే మూడే సినిమాలు అందర్నీ ఆకర్షించాయి. వీటిలో ఒకటి బాహుబలి. ఏడాదిన్నరగా ఊరించిన ఈ సినిమా విడుదలై అఖండ విజయం సాధించింది. తర్వాత అందర్నీ ఎట్రాక్ట్ చేసిన మూవీ శ్రీమంతుడు. దాదాపు 6నెలలుగా అందరి నోట్లో నానిన ఈ మూవీ కూడా విడదలై పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన మూవీ రుద్రమదేవి. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఈ ఏడాది భారీ బడ్జెట్ సినిమాలకు కాలం కలిసొస్తుందనే విషయాన్ని బాహుబలి, శ్రీమంతుడు నిరూపించాయి. సో.. ఆ సెంటిమెంట్ తో అన్నీ తానై గుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమదేవి కూడా మంచి విజయాన్నందుకుంటున్నంది అంచనా కడుతున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టే విభిన్నంగా ప్రమోషన్ ఇస్తూ, రోజుకో స్టిల్ విడుదల చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు గుణశేఖర్. పనిలోపనిగా మూవీని వీలైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే తెలుగు-తమిళ భాషల్లో రుద్రమదేవి విడుదలయ్యేందుకు లైన్ క్లియర్ అయింది. మరోవైపు మళయాళం వెర్షన్ కూడా సిద్ధమైంది. తాజాగా ఈ సినిమాను కన్నడలోకి కూడా డబ్ చేయాలని నిర్ణయించారు. ఈమధ్యంతా కన్నడనాట డబ్బింగ్ సినిమాలపై నిషేధం నడిచింది. తాజాగా బ్యాన్ ఎత్తేశారు. బ్యాన్ ఎత్తేసిన తర్వాత డబ్బింగ్ రూపంలో కన్నడ నాట విడుదలవుతున్న మొదటి సినిమా రుద్రమదేవే కావడం విశేషం. ఇలా సౌత్ లోని 4 రాష్ట్రాల్లో, 4 భాషల్లో విడుదలవుతున్న రుద్రమదేవి, ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
First Published:  7 Aug 2015 7:01 PM GMT
Next Story