Telugu Global
Others

న‌వీద్‌ను క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని కోరిన ఎన్ఐఏ 

తీవ్ర‌వాది న‌వీద్‌ ఉస్మాన్‌ను త‌మ క‌స్ట‌డీకి అప్ప‌గించాల‌ని జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జ‌మ్ము కాశ్మీర్ పోలీసుల‌ను కోరింది. అయితే, ఇప్ప‌టికే న‌వీద్ నుంచి కీల‌క స‌మాచారాన్ని సేక‌రించ‌డంతోపాటు ద‌ర్యాప్తు కీల‌క ద‌శ‌లో ఉంద‌ని కాశ్మీర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ స‌మ‌యంలో ఉగ్ర‌వాదిని ఎన్ఐఏ క‌స్ట‌డీకి ఇవ్వ‌లేమ‌ని వారు అంటున్నారు. పోలీస్ విచార‌ణ‌లో న‌వీద్ త‌న‌కు స‌హ‌క‌రించిన వారి వివ‌రాల‌తోపాటు ల‌ష్క‌రే తోయిబాలో పొందిన శిక్ష‌ణ వివ‌రాలు చెప్పారు. ఆయుధాల సేక‌ర‌ణ‌కు సంబంధించిన అంశాల‌తో త‌న‌తోపాటు […]

న‌వీద్‌ను క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని కోరిన ఎన్ఐఏ 
X
తీవ్ర‌వాది న‌వీద్‌ ఉస్మాన్‌ను త‌మ క‌స్ట‌డీకి అప్ప‌గించాల‌ని జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జ‌మ్ము కాశ్మీర్ పోలీసుల‌ను కోరింది. అయితే, ఇప్ప‌టికే న‌వీద్ నుంచి కీల‌క స‌మాచారాన్ని సేక‌రించ‌డంతోపాటు ద‌ర్యాప్తు కీల‌క ద‌శ‌లో ఉంద‌ని కాశ్మీర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ స‌మ‌యంలో ఉగ్ర‌వాదిని ఎన్ఐఏ క‌స్ట‌డీకి ఇవ్వ‌లేమ‌ని వారు అంటున్నారు. పోలీస్ విచార‌ణ‌లో న‌వీద్ త‌న‌కు స‌హ‌క‌రించిన వారి వివ‌రాల‌తోపాటు ల‌ష్క‌రే తోయిబాలో పొందిన శిక్ష‌ణ వివ‌రాలు చెప్పారు. ఆయుధాల సేక‌ర‌ణ‌కు సంబంధించిన అంశాల‌తో త‌న‌తోపాటు భార‌త్‌లోకి ప్ర‌వేశించిన ఇత‌ర టెర్ర‌రిస్టుల వివ‌రాల‌ను కూడా న‌వీద్ పోలీసుల‌కు తెలిపాడు. న‌వీద్ ఇచ్చిన స‌మాచారంతో పోలీసులు ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు.
First Published:  7 Aug 2015 1:09 PM GMT
Next Story