Telugu Global
Others

మంత్రగత్తెల నెపంతో ఐదుగురు మహిళల హత్య

మంత్రాలతో చేతబడి చేస్తున్నారనే నెపంతో ఐదుగురు మహిళలు అతిదారుణంగా హత్యకు గురయ్యారు. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాంచీ జిల్లాలోని కంజియా అనే ఊరిలో అర్థరాత్రి గ్రామస్తులంతా కలిసి మూకుమ్మడిగా ఐదుగురు మహిళల్ని కట్టెలతో కొట్టి, పదునైన కత్తులతో పొడిచి చంపారని జిల్లా రూరల్ ఎస్పీ రాజ్‌కుమార్ లక్రా తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రంలో మూఢ నమ్మకాలతో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. నేష్నల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వివరాల ప్రకారం 2013లో జార్ఖండ్‌లో 160 మంది […]

మంత్రగత్తెల నెపంతో ఐదుగురు మహిళల హత్య
X
మంత్రాలతో చేతబడి చేస్తున్నారనే నెపంతో ఐదుగురు మహిళలు అతిదారుణంగా హత్యకు గురయ్యారు. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాంచీ జిల్లాలోని కంజియా అనే ఊరిలో అర్థరాత్రి గ్రామస్తులంతా కలిసి మూకుమ్మడిగా ఐదుగురు మహిళల్ని కట్టెలతో కొట్టి, పదునైన కత్తులతో పొడిచి చంపారని జిల్లా రూరల్ ఎస్పీ రాజ్‌కుమార్ లక్రా తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రంలో మూఢ నమ్మకాలతో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. నేష్నల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వివరాల ప్రకారం 2013లో జార్ఖండ్‌లో 160 మంది మహిళలు హత్యకు గురికాగా అందులో 54 మంది మంత్రగత్తెల నెపంతో దుర్మరణం పాలయిన వారే.
First Published:  7 Aug 2015 1:17 PM GMT
Next Story