Telugu Global
Others

కేజ్రీవాల్‌తో శతృఘ్నసిన్హా భేటీ

బిజెపిలో ఉంటూనే అసమ్మతి స్వరం వినిపిస్తున్న ఆ పార్టీ ఎంపీ, సినీనటుడు శతృఘ్నసిన్హా ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వంతో నిత్యం యుద్ధం చేస్తున్నట్లు కనిపించే కేజ్రీవాల్‌తో సిన్హా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోపై ఇటీవల ఈ గన్‌షాట్‌ నాయకుడు బీహార్‌ సీఎం నితీష్‌ని కూడా కలిశారు. అయితే ఇపుడు కేజ్రివాల్‌తో రాజకీయాలు మాట్లాడలేదని, కేవలం మర్యాదపూర్వకంగా కలిశానని చెబుతున్నప్పటికీ అంతకుమించే చర్చించి ఉంటారని భావిస్తున్నారు. ఢిల్లీ అభివృద్ధి […]

కేజ్రీవాల్‌తో శతృఘ్నసిన్హా భేటీ
X
బిజెపిలో ఉంటూనే అసమ్మతి స్వరం వినిపిస్తున్న ఆ పార్టీ ఎంపీ, సినీనటుడు శతృఘ్నసిన్హా ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వంతో నిత్యం యుద్ధం చేస్తున్నట్లు కనిపించే కేజ్రీవాల్‌తో సిన్హా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోపై ఇటీవల ఈ గన్‌షాట్‌ నాయకుడు బీహార్‌ సీఎం నితీష్‌ని కూడా కలిశారు. అయితే ఇపుడు కేజ్రివాల్‌తో రాజకీయాలు మాట్లాడలేదని, కేవలం మర్యాదపూర్వకంగా కలిశానని చెబుతున్నప్పటికీ అంతకుమించే చర్చించి ఉంటారని భావిస్తున్నారు. ఢిల్లీ అభివృద్ధి గురించి, ఢిల్లీలో సినిమాల నిర్మాణానికి సంబంధించి వ్యవస్థను ఏర్పాటు చేయడం గురించి మాట్లాడామని చెప్పారు. గంటపాటు సాగిన ఈ సమావేశంలో మనీశ్ సుసోడియా కూడా పాల్గొన్నారు. తొలుత నితీశ్, ఇప్పుడు కేజ్రీవాల్, ఇలా బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించే వారందరినీ ఓ తాటిపైకి తీసుకొచ్చేందుకు శతృఘ్నసిన్హా కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది.
First Published:  6 Aug 2015 1:11 PM GMT
Next Story