Telugu Global
Others

అశోక్‌బాబు అలా అన‌వ‌చ్చా...?

ఉద్యోగ సంఘాల జేఏసీ నేత అశోక్‌బాబు పేరు స‌మైక్యాంధ్ర ఉద్య‌మ స‌మ‌యంలో మార్మోగిపోయింది. అయితే ఆయ‌న ఉద్య‌మానికి ద్రోహం చేశాడ‌ని కొంద‌రు, కాదు నిజాయితీగానే పోరాడాడ‌ని మ‌రికొంద‌రు వాదిస్తుంటారు. కీల‌క‌మైన స‌మ‌యంలో ఉద్య‌మాన్ని ఉధృతం చేయ‌కుండా ఆయ‌న నిర్వీర్య‌ప‌ర‌చ‌డం వ‌ల్లనే న‌ష్టం జ‌రిగింద‌నేవారూ ఉన్నారు. అయితే ఆయ‌న తాజాగా మ‌రోమారు వివాదంలో చిక్కుకున్నారు. ముసునూరు ఎమ్మార్వో వ‌న‌జాక్షిపై దాడులు జ‌ర‌గ‌డం, ఆ త‌ర్వాత ఆమెను చంపుతామంటూ బెదిరింపులు రావ‌డం సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెల్సిందే. ఈ ఉదంతంపై […]

అశోక్‌బాబు అలా అన‌వ‌చ్చా...?
X
ఉద్యోగ సంఘాల జేఏసీ నేత అశోక్‌బాబు పేరు స‌మైక్యాంధ్ర ఉద్య‌మ స‌మ‌యంలో మార్మోగిపోయింది. అయితే ఆయ‌న ఉద్య‌మానికి ద్రోహం చేశాడ‌ని కొంద‌రు, కాదు నిజాయితీగానే పోరాడాడ‌ని మ‌రికొంద‌రు వాదిస్తుంటారు. కీల‌క‌మైన స‌మ‌యంలో ఉద్య‌మాన్ని ఉధృతం చేయ‌కుండా ఆయ‌న నిర్వీర్య‌ప‌ర‌చ‌డం వ‌ల్లనే న‌ష్టం జ‌రిగింద‌నేవారూ ఉన్నారు. అయితే ఆయ‌న తాజాగా మ‌రోమారు వివాదంలో చిక్కుకున్నారు. ముసునూరు ఎమ్మార్వో వ‌న‌జాక్షిపై దాడులు జ‌ర‌గ‌డం, ఆ త‌ర్వాత ఆమెను చంపుతామంటూ బెదిరింపులు రావ‌డం సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెల్సిందే. ఈ ఉదంతంపై వ్యాఖ్యానించ‌మ‌ని విలేక‌రులు కోర‌గా అధికారుల‌పై దాడులు మామూలేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించార‌ట‌. అధికారుల‌పైనా అదీ మ‌హిళ‌ల‌పైన అధికార పార్టీవారు దుర్మార్గంగా దాడుల‌కు తెగ‌బ‌డుతుంటే ఉద్యోగ సంఘాల నాయ‌కుడు అయి ఉండీ అశోక్‌బాబు ఇలా వ్యాఖ్యానించ‌వ‌చ్చా? స‌ంఘాలు వేరే అయినా, మ‌న‌కు రాజ‌కీయ పార్టీల‌పై వ్య‌క్తిగ‌తంగా అభిమానం ఉన్నా, కుల‌ప‌ర‌మైన ప్రేమ ఉన్నా… నాయ‌క‌త్వ స్థానాల‌లో ఉన్న‌వారు వాట‌న్నిటినీ అణ‌చి ఉంచుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేదా? ఒక మ‌హిళ‌పై సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే త‌న అనుచ‌ర గూండాల‌తో దాడులు జ‌రిప‌డం రాష్ట్రమంతా క‌ళ్లారా చూసింది. ఆమె మీడియా ముందుకొచ్చి క‌న్నీళ్లు పెట్టుకున్నారు. పుష్క‌రాల హ‌డావిడిలో ఉన్న ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఈ పంచాయ‌తీపై అస్స‌లు స్పందిచ‌నేలేదు. హ‌డావిడి త‌గ్గాక జ‌రిపిన మంత్రివ‌ర్గ భేటీలో త‌ప్పంతా వ‌న‌జాక్షిదేన‌ని కూడా తేల్చేశారు. అంటే ప్ర‌భుత్వం వైపు నుంచి ఆమెను న్యాయం దొర‌క‌న‌ట్లే. ఇక ఉద్యోగ‌సంఘాలు అండ‌గా నిల‌బ‌డి అలాంటి కేసుల్లో దోషుల‌కు త‌గిన బుద్ది చెబుతాయ‌నుకుంటే అశోక్‌బాబు చేసిన వ్యాఖ్య అందుకు విరుద్ధంగా ఉంది. ఉద్య‌గుల‌పై దాడులు ఇపుడు కొత్తేమీ కాదు.. గ‌త ప్ర‌భుత్వ హయాంలోనూ జ‌రిగాయి అని అశోక్‌బాబు వ్యాఖ్యానించ‌డం చూస్తే ఆయ‌న ఈ ఘ‌ట‌న‌ను తేలిక‌గా తీసుకున్నార‌ని అర్ధ‌మౌతోంది. అంతేకాదు తాను అధికార పార్టీ తొత్తును అన్న నిగూఢార్ధం కూడా అందులో ధ్వ‌నిస్తోంది. ఒక మ‌హిళా అధికారిని చంపుతామ‌ని బెదిరింపు లేఖ వ‌చ్చింద‌ని తెలిస్తే ఇలా మాట్లాడ‌వ‌చ్చా.. మేమంతా అండ‌గా ఉంటాం అని మాట మాత్ర‌మైనా అన‌వ‌ద్దా..? ఇలాంటి నాయ‌కుల‌కు ఎలా బుద్ధి చెప్పాలో ఉద్యోగులే నిర్ణ‌యించుకోవాలి…
First Published:  5 Aug 2015 12:07 AM GMT
Next Story