Telugu Global
Others

మోదుగు పూలు పుస్తకాన్ని ఆవిష్క‌రించిన సినీన‌టుడు మాదాల ర‌వి 

స‌మాజంలోని అస‌మాన‌త‌లు తొల‌గించేందుకు, ఆధిప‌త్య భావ‌జాలంపై పోరాడేందుకు మోదుగుపూల మాస‌ప‌త్రిక ఆయుధం కావాల‌ని సినీన‌టుడు అభ్యుద‌య‌వాది మాదాల ర‌వి కోరారు. హైద‌రాబాద్‌లోని సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో ఆయ‌న సాహిత్య‌ సాంస్కృతికోద్య‌మ ప‌త్రిక మోదుగుపూలును ఆవిష్క‌రించారు. స‌మాజంలోని క‌వులు, అభ్యుద‌య‌వాదులు త‌మ క‌లాల‌కు ప‌దును పెట్టాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని, స‌మాజ మార్పుకోసం అంద‌రూ ఏకం కావాల‌ని ఆయ‌న అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్ గోపి, కంచె ఐల‌య్య‌, ఎస్‌.వీర‌య్య‌, జి.రాములు, ర‌త్న‌మాల‌, భూప‌తి త‌దిత‌ర్లు పాల్గొన్నారు.

First Published:  26 July 2015 1:06 PM GMT
Next Story