Telugu Global
Others

పార్లమెంట్‌ వద్ద తుపాకీ శబ్దాలు 

పార్లమెంటు దగ్గర తుపాకీ మోత కలకలం రేపింది. భారీగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఇది పార్లమెంటు వద్ద జరిగిన మాక్‌ డ్రిల్‌ అని తెలిసింది. ఒకవైపు పంజాబ్‌లో గురుదాస్‌పూర్‌ జిల్లా దినానగర్‌లో ఉగ్రవాద దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆందోళన కలిగించింది. ప్రస్తుతం దేశ సరిహద్దులతోపాటు ప్రముఖ నగరాలు, పట్టణాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు.

First Published:  26 July 2015 1:15 PM GMT
Next Story