Telugu Global
Others

మిస్ట‌ర్ ఇండియాగా హైద‌రాబాదీ 

హైద‌రాబాద్ అంటే మిస్ ఇండియా, మిస్ యూనివ‌ర్స్ వంటి అంద‌మైన భామ‌లే కాదు,  మిస్ట‌ర్ ఇండియా వంటి హ్యాండ్స‌మ్ కుర్రాళ్లు కూడా ఉన్నార‌ని నిరూపించారు  రోహిత్ ఖండేల్వాల్.  ముంబైలో గురువారం రాత్రి జ‌రిగిన‌ మిస్ట‌ర్ ఇండియా 2015 విజేత‌గా నిలిచిన రోహిత్  హైద‌రాబాద్ సిగ‌లో స‌రికొత్త టైటిల్‌ను అలంక‌రించారు.  మిస్ట‌ర్ ఇండియా టైటిల్ కోసం రోహిత్  ప‌దివేల మందితో పోటీప‌డ్డారు. బెంగ‌ళూరుకు చెందిన రాహుల్ రాజ‌శేఖ‌ర‌న్ , ముంబై వాసి ప్ర‌తీక్ గుజ‌రాల్‌లు ర‌న్న‌ర‌ప్‌లుగా  నిలిచారు. ఈ […]

హైద‌రాబాద్ అంటే మిస్ ఇండియా, మిస్ యూనివ‌ర్స్ వంటి అంద‌మైన భామ‌లే కాదు, మిస్ట‌ర్ ఇండియా వంటి హ్యాండ్స‌మ్ కుర్రాళ్లు కూడా ఉన్నార‌ని నిరూపించారు రోహిత్ ఖండేల్వాల్. ముంబైలో గురువారం రాత్రి జ‌రిగిన‌ మిస్ట‌ర్ ఇండియా 2015 విజేత‌గా నిలిచిన రోహిత్ హైద‌రాబాద్ సిగ‌లో స‌రికొత్త టైటిల్‌ను అలంక‌రించారు. మిస్ట‌ర్ ఇండియా టైటిల్ కోసం రోహిత్ ప‌దివేల మందితో పోటీప‌డ్డారు. బెంగ‌ళూరుకు చెందిన రాహుల్ రాజ‌శేఖ‌ర‌న్ , ముంబై వాసి ప్ర‌తీక్ గుజ‌రాల్‌లు ర‌న్న‌ర‌ప్‌లుగా నిలిచారు. ఈ వేడుక‌ల‌కు బాలీవుడ్ బ్యూటీ క‌రీనాక‌పూర్ హాజ‌రై మిస్ట‌ర్ ఇండియా రోహిత్‌ను అభినందించారు. మిస్ట‌ర్ ఇండియాగా చ‌రిత్ర సృష్టించిన రోహిత్ త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మిస్ట‌ర్ వ‌ర‌ల్డ్ పోటీల‌కు మ‌న‌దేశం త‌ర‌పున పోటీ ప‌డ‌నున్నారు.

First Published:  24 July 2015 1:06 PM GMT
Next Story