Telugu Global
Others

పవన్‌ కోసమే హోదాపై ధర్నా: జేసీ దివాకర్‌రెడ్డి

అనంతపురం పార్లమెంట్‌సభ్యుడు జె.సి.దివాకర్‌రెడ్డి మనసులో ఏమీ దాచుకోరు. ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడేయడం మొదటి నుంచీ అలవాటు. తాను సంధించే అస్త్రం స్వపక్షం మీద అయినా… విపక్షం మీద అయినా వెనకాముందూ ఆలోచించే తత్వం ఆయనకు లేదు. అందుకే గురువారం పార్లమెంటు ముఖ ద్వారం వద్ద, ఆ తర్వాత గాంధీ విగ్రహం ముందు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. హోదా కోసం కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి […]

పవన్‌ కోసమే హోదాపై ధర్నా: జేసీ దివాకర్‌రెడ్డి
X
అనంతపురం పార్లమెంట్‌సభ్యుడు జె.సి.దివాకర్‌రెడ్డి మనసులో ఏమీ దాచుకోరు. ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడేయడం మొదటి నుంచీ అలవాటు. తాను సంధించే అస్త్రం స్వపక్షం మీద అయినా… విపక్షం మీద అయినా వెనకాముందూ ఆలోచించే తత్వం ఆయనకు లేదు. అందుకే గురువారం పార్లమెంటు ముఖ ద్వారం వద్ద, ఆ తర్వాత గాంధీ విగ్రహం ముందు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. హోదా కోసం కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ఆయనతోపాటు కేంద్రమంత్రి సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్, గల్లా జయదేవ్, నిమ్మల కిష్టప్ప తదితరులు హాజరయి మొక్కుబడి తీర్చుకున్నారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్న వారిలో కొంచెం కూడా డిమాండు నేచర్‌ కనిపించలేదంటే ఒట్టు. ప్రత్యేక హోదా కోసం అడగక పోతే రాష్ట్రంలో మాటొస్తుందన్నట్టే ఉంది వారి ప్రదర్శన తీరు. సుష్మా స్వరాజ్‌, వసుంధర రాజే, శివరాజ్‌ సంఘ్‌ చౌహాన్‌ పేర్లు చెప్పి పార్లమెంటును కాంగ్రెస్‌ పార్టీ అండ్‌కో స్తంభింప జేయడం వల్ల తాము ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోపాటు పలు సమస్యలను ప్రస్తావించలేకపోతున్నామంటూ వాపోయారీ నేతలు. పార్లమెంటులో ఎలా వ్యవహరించాలో ప్రతిపక్షాలు తెలుసుకోవాలని సుద్దులు చెప్పారు. అంతా అయిపోయింది. ప్రదర్శనను నుంచి దివాకర్‌రెడ్డితో సహా ఎంపీలంతా బయటకు వచ్చారు. అప్పుడే వ్యక్తం చేశారు దివాకర్‌రెడ్డి తన మనసులో మాట. ఇలాంటి ధర్నాల వల్ల ఫలితం ఉండదని… పవన్‌కళ్యాణ్‌ను సంతృప్తి పరిచేందుకు…. ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ ధర్నాలు ఉపయోగపడతాయని జేసీ వ్యాఖ్యానించడం కొసమెరుపు.
First Published:  23 July 2015 11:53 AM GMT
Next Story