Telugu Global
Others

మోడీని హిట్ల‌ర్ తో పోల్చిన ముంబై మేయ‌ర్  

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌వ‌ర్త‌న  జ‌ర్మ‌న్ నియంత హిట్ల‌ర్‌లా ఉంద‌ని వ్యాఖ్యానించి సంచ‌ల‌నం సృష్టించారు శివ‌సేన‌కు చెందిన ముంబై మేయ‌ర్ స్నేహ‌ల్ అంబేక‌ర్‌. ఆయ‌న కొన్ని విష‌యాల్లోనే  గొప్ప‌గా ప‌ని చేస్తున్నార‌ని, అధికార‌మంతా మోడీ చేతిలోనే కేంద్రీకృతం కావ‌డం వ‌ల‌న ఆయ‌న హిట్ల‌ర్‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆమె ఆరోపించారు. ద‌ళిత వర్గానికి చెందిన స్నేహ‌ల్ 2014లో ముంబై మేయ‌ర్‌గా ఎన్నిక‌య్యారు. అప్ప‌టి నుంచి ఎన్నో వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన ఆమె తాజాగా ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. త‌న‌కు […]

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌వ‌ర్త‌న జ‌ర్మ‌న్ నియంత హిట్ల‌ర్‌లా ఉంద‌ని వ్యాఖ్యానించి సంచ‌ల‌నం సృష్టించారు శివ‌సేన‌కు చెందిన ముంబై మేయ‌ర్ స్నేహ‌ల్ అంబేక‌ర్‌. ఆయ‌న కొన్ని విష‌యాల్లోనే గొప్ప‌గా ప‌ని చేస్తున్నార‌ని, అధికార‌మంతా మోడీ చేతిలోనే కేంద్రీకృతం కావ‌డం వ‌ల‌న ఆయ‌న హిట్ల‌ర్‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆమె ఆరోపించారు. ద‌ళిత వర్గానికి చెందిన స్నేహ‌ల్ 2014లో ముంబై మేయ‌ర్‌గా ఎన్నిక‌య్యారు. అప్ప‌టి నుంచి ఎన్నో వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన ఆమె తాజాగా ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. త‌న‌కు ఎర్ర‌బుగ్గ కారు వాడుకోవాల‌నుంద‌ని మ‌న‌సులో మాటను కూడా బైట పెట్టారు.
First Published:  20 July 2015 1:05 PM GMT
Next Story